జాతీయ వార్తలు

ఫలవంతంగా శీతాకాల పార్లమెంటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: నిర్మాణాత్మక చర్చలతో, మేలు చేసే సూచనలతో ప్రస్తుత శీతాకాల పార్లమెంటు సమావేశాలు ఫలవంతం అవుతాయన్న నమ్మకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. దేశం ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలకు ఈ సమావేశాలు పరిష్కారం చూపగలవని ఆయన అన్నారు. శీతాకాల సమావేశాల్లో 25 పెండింగ్ బిల్లులు, 14 కొత్త బిల్లులకు ఆమోదముద్ర లభిస్తుందని కేంద్రం భావిస్తోంది. ముస్లిం మహిళలకు మేలు చేసే ‘ముమ్మారు తలాక్’ బిల్లుకు ప్రస్తుత సమావేశాల్లోనే పార్లమెంటు ఆమోదం లభించే అవకాశం ఉంది. ‘పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈరోజు (శుక్రవారం) ప్రారంభమయ్యాయి.. ఈ సమావేశాలు ఆశించిన ఫలితాన్ని ఇస్తాయన్న నమ్మకం నాకు ఉంది.. అర్థవంతమైన చర్చలు జరిగినపుడే దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది..’ అని మోదీ విలేఖరులతో అన్నారు. గురువారం జరిగిన అఖిలపక్ష భేటీలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు దేశాన్ని ముందుకు నడిపించాలన్న ఆకాంక్షను అన్ని రాజకీయ పార్టీలు వ్యక్తం చేశాయని ఆయన గుర్తుచేశారు. యావత్ జాతి పురోగమించేలా సమావేశాలు జరగాలని, అత్యంత విలువైన పార్లమెంటు సమయాన్ని దేశ క్షేమం కోసం వినియోగించాలని అన్నారు. జాతీయ స్థాయిలో ప్రభావం చూపేలా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుందని, అందుకు పార్లమెంటు సరైన వేదిక అని అన్నారు. ఆశావహ దృక్పథంతో పార్లమెంటు పనిచేసినపుడు దేశానికి మేలు జరుగుతుందని, ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను తీర్చాల్సిన బాధ్యత పార్లమెంటుపై ఉందన్నారు. సాధారణంగా దీపావళి పండుగ వెళ్లాక శీతాకాలం ప్రారంభం అవుతుందని, అయితే వాతావరణంలో మార్పుల ఫలితంగా ఇపుడు అలా జరగడం లేదని మోదీ అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు 2017లో మొదలై 2018లోనూ కొనసాగుతాయని అన్నారు. కాగా, శుక్రవారం ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు వచ్చే నెల 5వ తేదీ వరకూ కొనసాగుతాయి.

చిత్రం..శీతాకాల పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్న ప్రధాని నరేంద్ర మోదీ