జాతీయ వార్తలు

అందరికీ ఆరోగ్య హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబరు 15: దేశంలోని పౌరులందరికీ ఆరోగ్యహక్కు కల్పించాలని కోరుతూ ఉద్దేశించిన ప్రైవేటు మెంబరు బిల్లును రాజ్యసభలో వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి శుక్రవారాం ప్రవేశపెట్టారు. దీంతో పాటుగా మరో రెండు ప్రైవేటు మెంబరు బిల్లులను కూడా ఆయన ప్రవేశపెట్టారు. విశాఖ కేంద్రంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇనె్వస్టిమెంట్ రీజియన్(ఐటిఐఆర్)ను ఏర్పాటు చేయాలని కోరుతూ 2014, ఆగస్టు 26లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదన ఇంకా ఆర్థిక వ్యవహరాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) పరిశీలనకు పంపలేదని ఐటీ సహాయమంత్రి అల్ఫోన్స్ కన్నాంతనమ్ రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చా రు. ఈ జాప్యానికి కారణాలను మంత్రి వివరిస్తూ భువనేశ్వర్‌లో ఐటిఐర్ ఏర్పాటు కోరుతూ 2010లో ఒడిశా ప్రభుత్వం ప్రతిపాదనను సమర్పించినట్టు తెలిపారు. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత దక్షిణ మధ్య రైల్వేలోని ఓపెన్ లైన్, కన్షట్రక్షన్ ఆర్గనైజేషన్‌లో కాంట్రాక్టర్లు తాత్కాలికంగా పనలు నిలిపి వేసిన విషయం వాస్తవమేనని రైల్వే సహాయమంత్రి శ్రీ రాజెన్ గొహైన్ అంగీకరించారు. ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు కేంద్రమంత్రి వెల్లడించారు. దేశంలో వివిధ ప్రాంతాలలో నెలకొన్న కరవు, వరదలను ఎదుర్కొనేందుకు జాతీయ వరద,కరవు నివారణ బోర్డును ఏర్పాటు చేయాలని ఉద్దేశించిన ప్రైవేటు మెంబరును, అలాగే దేశంలోని ప్లే స్కూళ్లపై నియంత్రణకు ఉద్దేశించిన ప్రైవేటు మెంబరు బిల్లును కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి సుబ్బరామిరెడ్డి సభలో ప్రవేశపెట్టారు.