జాతీయ వార్తలు

స్వచ్ఛంద సంస్థకు రూ.లక్ష జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: అనవసర విషయంపై విలువైన తమ సమయాన్ని వృథా చేసినందుకు ఆగ్రహం ప్రకటిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు లక్ష రూపాయల జరిమానా విధించింది. దీనికి సంబంధించి పూర్వపరాలిలా ఉన్నాయి. హానికరమైన ఆహార పదార్థాల జాబితాలో మద్యాన్ని చేర్చుతూ ఆదేశాలు జారీ చేయాలంటూ విశాఖపట్నానికి చెందిన చైతన్య స్రవంతి అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీం కోర్టులో కేసు వేసింది. శుక్రవారం నాడు ఈ పిటిషన్ జస్టిస్ నారీమన్, జస్టిస్ నవీన్ సిన్హాలతో కూడన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ‘చైతన్య స్రవంతి’ తరఫున న్యాయవాదిగా హాజరైన శ్రవణ్ కుమార్ తన వాదనలు వినిపించారు. సిగరెట్ ప్యాకెట్ల మీద హెచ్చరిక గుర్తు వేసినట్లుగా మద్యం సీసాలపైనా అలాంటి గుర్తులు వేయాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, అనవసర విషయాలపై తమ సమయం వృథా చేశారంటూ న్యాయమూర్తులు లక్ష రూపాయల జరిమానా విధించింది.