జాతీయ వార్తలు

పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఒకేసారి ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, డిసెంబర్ 16: పంచాయతీ నుంచి పార్లమెంట వరకూ ఏకకాలంలో ఎన్నికలు జరపాలని, ఈ ప్రక్రియ నెల రోజుల్లో పూర్తయితే దేశానికి ఎంతో మేలు జరుగుతుందని ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు అభిప్రాయ పడ్డారు. దేశంలో రాజకీయ పార్టీలకు నిరంతరం ఎన్నికలు తప్ప మిగతా విషయాలపై ఆసక్తి లేదని, ‘ఎలక్షన్-సెలక్షన్-కరప్షన్’ అనే మూడు సూత్రాల కార్యక్రమాన్ని రాజకీయ పార్టీలు అమలు చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ శనివారం జరిగిన ‘్భరత ఆలోచనల సమ్మేళనం-2017’లో ఆయన మాట్లాడుతూ, అన్ని స్థాయిలకు సంబంధించిన ఎన్నికలను ఏకకాలంలో జరిపేందుకు రాజకీయ పార్టీలు అవగాహన పెంచుకోవాలన్నారు. నిరంతరం ఎన్నికలు జరుగుతున్నందున అభివృద్ధి కార్యక్రమాలపై నేతలు దృష్టి సారించడం లేదన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి జరపాలని ప్రధాని మోదీ చెబుతున్నారని వెంకయ్య గుర్తు చేశారు. కాగా, పాకిస్తాన్ సహా అన్ని దేశాలతో భారత్ స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటోందన్నారు. చట్టసభలు ప్రజా సమస్యలకు పరిష్కార వేదికలు కావాలని, రాజకీయ పార్టీలు గందరగోళం సృష్టించడానికి కాదని ఆయన అన్నారు.