జాతీయ వార్తలు

మధుర అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధుర, జూన్ 4: ఉత్తరప్రదేశ్‌లోని మధుర పట్టణంలో ‘స్వాధీన్ భారత్ సుభాష్ సేన’ నేతృత్వంలో కనీ వినీ ఎరుగని రీతిలో హింసాకాండ చెలరేగి 24 మందిని బలిగొన్న 48 గంటల తర్వాత ఈ హింసాకాండ ప్రధాన నిందితుడు సాయుధ ముఠా నేత రామ్‌వృ యాదవ్ మృతి చెందినట్లు పోలీసులు శనివారం సాయంత్రం ధ్రువీకరించారు. అతని మృత దేహాన్ని పోలీసుల కస్టడీలో ఉన్న అతని అనుచరులు కొందరు గుర్తించారని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ జావేద్ అహ్మద్ శనివారం సాయంత్రం ట్విట్టర్‌లో తెలిపారు. యాదవ్ నేతృత్వంలో దాదాపు 3 వేల మంది అతని అనుచరులు పోలీసులపై దాడి చేసినప్పుడు జరిగిన ఘర్షణల్లో 22 మంది అనుచరులతో పాటుగా అతను కూడా చనిపోయినట్లు ఆయన తెలిపారు. రామ్‌వృ యాదవ్ మృత దేహాన్ని తుది ధ్రువీకరణ కోసం అతని కుటుంబ సభ్యులకు కూడా సమాచారమిచ్చినట్లు అహ్మద్ తెలిపారు. ఈ అల్లర్లకు సంబంధించి పోలీసులు శనివారం గుర్తించిన 12 మందిపైన, గుర్తించని మరో 3వేల మందిపైన కేసు నమోదు చేశారు. ఈ ఘర్షణలో గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వారిలో ముగ్గురు చనిపోవడంతో మృతుల సంఖ్య 27కు చేరుకుంది.