జాతీయ వార్తలు

ప్రధాని కావాలన్న కాంక్ష లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జూన్ 6: ప్రధాన మంత్రి పీఠాన్ని అధిష్ఠించాలని తాను ఎన్నడూ ఆశించలేదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నితీశ్ బిజెపి యేతర కూటమి తరఫున ప్రధాన మంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పాట్నాలో సోమవారం ఆయన ‘సూపర్-30’ వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ జీవిత చరిత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ, జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా పార్లమెంట్ సభ్యుడిని కావాలని ఆశిస్తున్నానని, అంతేతప్ప మంత్రినో, ముఖ్యమంత్రినో లేక ప్రధాన మంత్రినో కావాలని తాను ఎన్నడూ కలగనలేదని చెప్పారు. ‘ప్రధాన మంత్రి పదవిని చేపట్టాలని నేను ఎన్నడూ ఆశించకపోయినప్పటికీ కొంత మంది వ్యక్తులు నా ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని నితీశ్ పేర్కొంటూ తనపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేస్తున్న బిజెపి నాయకులపై పరోక్షంగా ధ్వజమెత్తారు. ప్రధాన మంత్రి పదవిని అధిష్ఠించే శక్తిసామర్ధ్యాలు నితీశ్‌కు ఉన్నాయని ఒకవైపు రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) అధినేత లాలూప్రసాద్ యాదవ్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ తదితరులు ప్రశంసలు గుప్పిస్తుంటే, మరోవైపు ఈ విషయంలో నితీశ్‌పై బిజెపితోపాటు ఎన్‌డిఎలోని ఇతర పక్షాలకు చెందిన మరికొందరు నాయకులు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
chitram ఆనంద్ కుమార్ జీవిత చరిత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతున్న నితీశ్ కుమార్