జాతీయ వార్తలు

‘గీత’ దాటడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూన్ 6: ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఎఎఫ్‌ఎస్‌పిఏ) దుర్వినియోగం అయిన దాఖలాలు లేవని సైన్యం ప్రకటించింది. ఎఎఫ్‌ఎస్‌పిఏ దుర్వినియోగానికి సంబంధించి ఇటీవల ఎక్కడా ఫిర్యాదులు లేవని స్పష్టం చేశారు. ఈస్ట్రన్ కమాండెంట్ దీనిపై మాట్లాడారు. చట్టం సమర్థవంతంగానే అమలవుతోందని, దుర్వినియోగం అవుతున్న సంఘటన ఎక్కడా ఒక్కటి కూడా లేదని ఈస్ట్రన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రవీణ్ భక్షి తెలిపారు. మిలిటెన్సీని అదుపుచేసే క్రమంలో అవసరమైతేనే ఎఎఫ్‌ఎస్‌పిఏ అవసరం తమకు కలుగుతోందితప్ప మిగతా సమయాల్లో దాన్ని వాడుకోవవడం లేదని ఆయన అన్నారు. సాయుధ దళాల ప్రత్యేక చట్టం అత్యంత క్రూరమైందని దాన్ని ఉపసంహరించుకోవాలని మానవ హక్కుల సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. మణిపూర్‌లో మానవ హక్కుల నాయకురాలు ఛాను షర్మిల ఎఎఫ్‌ఎస్‌పిఏను ఎత్తివేయాలంటూ 15 ఏళ్లుగా ఆమరణదీక్ష చేస్తున్నారు. ఇంఫాల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకు ముక్కుద్వారా ద్రవాహారం ఎక్కిస్తున్నారు. ఆత్మహత్యాయత్నం కేసులో షర్మిలను అనేకసార్లు అరెస్టు చేయడం, బెయిల్‌పై విడుదలవ్వడం, మళ్లీ దీక్షకు కూర్చోవడం జరుగుతోంది.
chitram లెఫ్టినెంట్ జనరల్ ప్రవీణ్ భక్షి