జాతీయ వార్తలు

జరిమానా చెల్లించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 6: ఢిల్లీలోని యమునా నడి ఒడ్డున నిర్వహించిన ఒక అంతర్జాతీయ కార్యక్రమంలో అక్కడ జీవవైవిధ్యానికి నష్టం కలిగిందన్న ఆరోపణల నేపథ్యంలో పరిహారంగా మిగిలిన నాలుగు కోట్ల 75లక్షల రూపాయలను ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ చెల్లించింది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) ఆదేశం మేరకు ఈ మొత్తాన్ని ఢిల్లీ అభివృద్ధి అథారిటీ (డిడిఏ) వద్ద డిపాజిట్ చేసింది. మార్చి నెలలో యమునా నది ఒడ్డున ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాన్ని శ్రీశ్రీ రవిశంకర్ సారథ్యంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహించింది. ఆ సందర్భంగా యమునా నది పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి నష్టం కలిగించిందంటూ, మొత్తం ఐదు కోట్ల రూపాయలను పరిహారంగా చెల్లించాలని ఎన్‌జిటి ఆదేశించింది. దాని ప్రకారమే నాలుగు కోట్ల 75 లక్షల రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్‌ను ఈ నెల 3వ తేదీన అందించినట్లు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని ఢిల్లీ అభివృద్ధి అథారిటీ తరఫు న్యాయవాది ఖుష్ శర్మ కూడా ధ్రువీకరించారు.
అంతర్జాతీయ కార్యక్రమ నిర్వహణకు యమునా నది ఒడ్డున నిర్మించిన కట్టడాలు (ఫైల్ ఫోటో)