జాతీయ వార్తలు

మధుర కలెక్టర్‌ బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూన్ 6: ఘర్షణలతో అట్టుడుకుతున్న ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఆ జిల్లా కలెక్టర్‌తోపాటు సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌ఎస్‌పి)పై బదిలీ వేటు పడింది. మధురలోని జవహర్‌బాగ్‌లో నాలుగు రోజుల క్రితం హింసాత్మక ఘర్షణలు చెలరేగి ఇద్దరు పోలీసులు సహా 29 మంది మృతిచెందగా, అనేకమంది గాయపడిన విషయం తెలిసిందే. దీంతో మధుర జిల్లా కలెక్టర్‌ను, ఎస్‌ఎస్‌పిని బదిలీ చేశామని, వీరి స్థానంలో కొత్త అధికారులు త్వరలోనే విధుల్లో చేరుతారని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ ఘర్షణలపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్)పై తక్షణమే విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు సోమవారం అంగీకరించింది. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని జస్టిస్ పిసి.ఘోష్, జస్టిస్ అమితావ్ రాయ్‌లతో కూడిన సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ పిటిషన్ దాఖలు చేసిన అశ్విన్ ఉపాధ్యాయ్ అనే న్యాయవాది తరఫున కామినీ జైస్వాల్ అనే మరో న్యాయవాది సోమవారం సుప్రీం కోర్టుకు తమ వాదన వినిపించారు. మధురలో చెలరేగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో ఇప్పటికే దాదాపు 200 వాహనాలు దగ్ధమయ్యాయని, ఈ ఘర్షణలకు సంబంధించిన సాక్ష్యాధారాలను నాశనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ధర్మాసనానికి వివరించారు. ఈ ఘర్షణల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారంపై సిబిఐతో దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని, కనుక తమ పిటిషన్‌పై తక్షణమే విచారణ జరపాలని కామినీ జైస్వాల్ విజ్ఞప్తి చేయడంతో మంగళవారం ఈ అంశంపై విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది.
chitram యుపిలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ సోమవారం లక్నోలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న బిజెపి కార్యకర్తలు