జాతీయ వార్తలు

మాజీ డ్రైవర్ అప్రూవర్‌గా మారితే అభ్యంతరం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 6: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసు కొత్త మలుపుతిరిగింది. ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా మాజీ కారు డ్రైవర్ శ్యామవర్ రాయ్ తాను అప్రూవర్‌గా మారతానని ప్రత్యేక కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో రాయ్ అప్రూవర్‌గా మారితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సిబిఐ స్పష్టం చేసింది. ‘ఇంద్రాణి మాజీ డ్రైవర్ శ్యామవర్ రాయ్ అప్రూవర్‌గా మారితే మరిన్ని వాస్తవాలు వెలుగుచూస్తాయి. కాబట్టి మేం ఎలాంటి అభ్యంతరం చెప్పబోం. ఈ మేరకు మేం పిటిషన్ దాఖలు చేశాం’ అని సిబిఐ అధికారులు వెల్లడించారు. షీనాబోరా కేసులో తాను అప్రూవర్‌గా మారతానని గత నెలలోనే డ్రైవర్ కోర్టుకు తెలిపాడు. దీనిపై తమ అభిప్రాయం తెలియజేయడానికి కొంత సమయం కావాలని సిబిఐ ప్రత్యేక ప్రాసిక్యూటర్ కవితా పాటిల్ గత నెల 17న కోర్టును అభ్యర్థించారు. సోమవారం కేసు విచారణ సందర్భంగా రాయ్ అప్రూవర్‌గా మారితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సిబిఐ స్పష్టం చేసింది. 2012లో షీనాబోరా హత్యకు గురైంది. 2015లో ఇంద్రాణి మాజీ డ్రైవర్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి అతడు జైలులోనే ఉన్నాడు. షీనా కేసులో మరిన్ని వాస్తవాలు తెలుపుతానని గత నెలలో రెండు పేజీల లేఖను న్యాయమూర్తికి అందజేశాడు. ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్‌ఖన్నా, డ్రైవర్ రాయ్ కలిసి షీనా పీకనులిమి హత్య చేశారు. ఇదంతా కారులోనే జరిగిందని డ్రైవర్ తన వాంగ్మూలంలో తెలిపాడు. రాయ్‌గఢ్ అడవుల్లో షీనా మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. గత ఏడాది ఆగస్టులో ఈ దారుణం వెలుగుచూసింది. ఇంద్రాణి, సంజీవ్‌ఖన్నా, రాయ్‌లను ఆగస్టులోనే అరెస్టుచేశారు. ఇంద్రాణి ప్రస్తుత భర్త పీటర్ ముఖర్జియాను నవంబర్‌లో అరెస్టు చేశారు. పీటర్, ఖన్నా ఆర్థర్‌రోడ్ జైలులో, ఇంద్రాణి బైకుల్లా మహిళా జైలులో ఉన్నారు.