జాతీయ వార్తలు

మాల్యా, హెలికాప్టర్ కుంభకోణాలపై ‘సిట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 9: హైప్రొఫైల్ కేసుల విచారణ వేగవంతం చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ నిర్ణయించింది. వివిఐపి హెలికాప్టర్ల కుంభకోణం, లిక్కర్ కింగ్ విజయమాల్యా రుణాల ఎగవేత వంటి కేసులు సత్వరం విచారణ చేపట్టడానికి గుజరాత్ కేడర్ ఐపిఎస్ అధికారి సారథ్యంలో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (సిట్)ను సిబిఐ నియమించింది. అడిషనల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థాన నేతృత్వంలో దర్యాప్తు కమిటీ పనిచేస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. 1984 కేడర్ ఐపిఎస్ అధికారి రాకేష్‌కు సిట్ చీఫ్‌గా నియమించారు. 2002 ఫిబ్రవరిలో గోధ్రాలో జరిగిన సబర్మతి ఎక్స్‌ప్రెస్ దగ్ధం కేసును విచారించిన సిట్‌కు ఆయన సారధ్యం వహించారు. పశుదాణా కుంభకోణం దర్యాప్తులోనూ ఆయన సహకరించారు. తాజాగా రాకేష్ ఆస్థాన నేతృత్వంలో ఏర్పాటైన సిట్ తొలుత అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం, విజయ్ మాల్యా రుణాల ఎగవేత కేసుల దర్యాప్తును చేపట్టనుంది. 3,600 కోట్ల రూపాయల ఒప్పందానికి సంబంధించిన హెలికాప్టర్ల కొనుగోలులో అవినీతి జరిగినట్టు ఇటలీ కోర్టు నిర్ధారించింది. ఈ కుంభకోణంలో పలువురు భారతీయుల పాత్ర ఉందని తేలింది. రాకేష్ ఆస్థాన సారధ్యంలో ఏర్పాటైన సిట్ దీనిపై దర్యాప్తు ప్రారంభిస్తుంది. అలాగే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కోసం బ్యాంకుల నుంచి వేలకోట్ల రూపాయలు రుణంగా తీసుకుని విదేశీ అకౌంట్లలోకి బదిలీ చేసిన విజయమాల్య వ్యవహారంపైనా సిట్ దర్యాప్తు చేపడుతుంది.