జాతీయ వార్తలు

రాజీవ్ హంతకులను విడుదల చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూన్ 11: పాతిక సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్న మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హంతకులు ఏడుగురిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ పలు తమిళ సంఘాలు చెన్నైలో శనివారం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాయి. రాజీవ్ గాంధీ హత్యానంతరం (మే 21, 1991) అరెస్టయి, మరణశిక్ష పడ్డ ఏడుగురు నేరస్థులు పెరారివలన్, మురుగన్, శంతన్, నళిని, రాబర్ట్ పయాస్, జయకుమార్, రవిచంద్రన్‌ల జైలు జీవితం శనివారానికి సరిగ్గా 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. పెరారివలన్ తల్లి అర్పుత్తమ్మల్ నేతృత్వంలో ఈ ప్రదర్శన జరిగింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, తమిళ సినిమా దిగ్గజాలు, హక్కుల సంఘాల కార్యకర్తలు, మద్దతుదారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పట్టాలి మక్కల్ కచ్చి నేత, ధర్మపురి ఎంపి అన్బుమణి రాందాస్, సినిమా నటులు నాజర్, పొన్‌వన్నన్, సత్యరాజ్, దర్శకుడు విక్రమన్ వంటి ప్రముఖులు ఈ ప్రదర్శనలో భాగం పంచుకున్నారు. రాజీవ్ హత్య కేసులో మరణశిక్ష పడిన నేరస్థులలో నళిని శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ, రాజీవ్‌గాంధీ భార్య కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అభ్యర్థన మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మురుగన్, సంతన్, పెరారివలన్‌ల క్షమాభిక్షలపై నిర్ణయం తీసుకోవటంలో ఆలస్యం చేయటంతో వారి మరణ శిక్షలను కూడా తగ్గిస్తూ సుప్రీం కోర్టు 2014 ఫిబ్రవరిలో తగ్గించింది. ఈ ఏడుగురు నేరస్థులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కేంద్రం అభిప్రాయాన్ని కోరింది. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం తిరస్కరించింది. ఈ వ్యవహారం సుప్రీం కోర్టులో ఇంకా పెండింగ్‌లో ఉంది.

చిత్రం రాజీవ్ గాంధీ హంతకులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ
తమిళ సంఘాలు చెన్నైలో శనివారం ర్యాలీ నిర్వహించిన దృశ్యం