జాతీయ వార్తలు

కన్హయ్యకు కొత్త కష్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 11: జెఎన్‌యు విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్, మరో ఇద్దరు నేతలపై దేవద్రోహం కేసు నమోదుకు దారి తీసిన గత ఫిబ్రవరి 9న యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమానికి సంబంధించిన ఎడిటింగ్ చేయని వీడియో దృశ్యాలు నిజమైనవేనని సిబిఐ ఫోరెన్సిక్ ల్యాబ్ పేర్కొన్నదని పోలీసులు శనివారం చెప్పారు. ఓ హిందీ న్యూస్ చానల్‌నుంచి సంపాదించిన ఈ వీడియో దృశ్యాలను కెమెరా, మెమరీ కార్డు, ఆ దృశ్యాలున్న సిడి, వైర్లు, ఇతర పరికరాలతో పాటుగా పరీక్షించడం కోసం నగరంలోని సిబిఐ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు పోలీసులు చెప్పారు. ఈ వీడియో దృశ్యాలు నిజమైనవేనని పేర్కొంటూ సిబిఐ ఫోరెన్సిక్ ల్యాబ్ ఈ నెల 8న ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగానికి ఒక నివేదిక పంపించినట్లు వారు చెప్పారు. ఈ నివేదిక అందినట్లు స్పెషల్ సెల్ ప్రత్యేక పోలీసు కమిషనర్ అరవింద్ దీప్ ధ్రువీకరించారు కానీ వివరాలు వెల్లడించలేదు. అంతకు ముందు ఢిల్లీ పోలీసులు గాంధీనగర్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు నాలుగు వీడియో క్లిం ప్పింగ్స్ పంపించగా, అవన్నీ సరయినవేనని ఆ ల్యాబ్ తన నివేదికలో పేర్కొంది. అయితే ఈ సంఘటనపై ఢిల్లీ ప్రభుత్వం నియమించిన దర్యాప్తు బృందం హైదరాబాద్‌లోని ప్రైవేట్ లేబరేటరీ అయిన ట్రూత్ ల్యాబ్‌కు ఈ సంఘటనకు సంబంధించిన ఏడు వీడియో క్లిప్పింగ్స్‌ను పంపించగా, వాటిలో రెండు క్లిప్పింగ్‌ను మాత్రం తారుమారు చేశారని, మిగతావన్నీ సరయినవేనని ఆ ల్యాబ్ తన నివేదికలో పేర్కొంది. కాగా, న్యూస్ చానల్‌నుంచి సంపాదించిన సిడిలోని ఎడిట్ చేయని దృశ్యాల ఆధారంగానే తాము ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామే తప్ప టీవీలో ప్రసారమైన దృశ్యాల ఆధారంగా కాదని పోలీసులు అంటున్నారు.