జాతీయ వార్తలు

ఉపాధ్యాయులకు డ్రెస్‌కోడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జూన్ 11: స్కూల్ టీచర్లు ఎవరూ జీన్స్ ధరించకూడదని హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో ఉండగా సాధారణ దుస్తులే వేసుకోవాలని హర్యానా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డైరక్టరేట్ స్పష్టం చేసింది. ‘ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు జీన్స్ ధరించి విధులకు హాజరవుతున్నారు. విద్యాశాఖాధికారులు పాఠశాలలు తనిఖీలప్పుడూ జీన్స్‌తోనే ఉండడం అనుచితం. అందుకే అలాంటి దుస్తులపై ఆంక్షలు విధించాం’ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా ప్రాధమిక విద్య అధికారులందరికీ ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలిపారు. పాఠశాలలకు / విద్యా డైరక్టరేట్‌కు ఫార్మల్ (సాధారణ) దుస్తులతోనే రావాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయంపై హర్యానా విద్యాలయ అధ్యాపక్ సంఘ్ తీవ్రంగా విరుచుకుపడింది. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి చర్యలకు దిగుతోందని సంఘ్ ఆరోపించింది. ఉపాధ్యాయులు ఏ దుస్తులు వేసుకోవాలో నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని వారు విమర్శించారు. విద్యార్థులు చదువుచెప్పడం వరకే ఉపాధ్యాయుల బాధ్యత అని, దీనికోసం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలే తప్పించి జీన్స్ వేసుకోవాలా, దోవతి ధరించాలా అని ఆదేశించడం సమర్థనీయం కాదన్నారు. బడ్జెట్ రూపకల్పన, బదిలీలు, నియామకాల వంటివే ప్రభుత్వం బాధ్యత అని ఉపాధ్యాయ సంఘం పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాలు ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.