జాతీయ వార్తలు

కాంగ్రెస్ పార్టీకి కాయకల్ప చికిత్స!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 11: అఖిల భారత కాంగ్రెస్ కమిటీని పునర్వ్యవస్థీకరణకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సమాయత్తం అవుతున్నారు. రాజ్యసభకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత సోనియా కాంగ్రెస్ కమిటీని పునర్వ్యవస్థీకరిస్తారన్న అంచనాలున్న విషయం తెలిసిందే. అందుకువీలుగా ఆమె కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల రాజీనామాలు తీసుకున్నట్టు ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ కమిటీతోపాటు వర్కింగ్ కమిటీలో కొత్తవారికి పెద్ద పీట వేయనున్నట్టు తెలుస్తోంది. పార్టీ పునర్వ్యవస్థీకరణ అనంతరం ఒకటి రెండు నెలల్లో ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా నియమిస్తారని అంటున్నారు. పార్టీలోని సీనియర్, జూనియర్ నేతల మధ్య కుదిరిన రాజీమేరకు మొదట ఏఐసిసి పునర్వ్యస్థీకరణ అనంతరం రాహుల్‌ను పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తారని అంటున్నారు. సోనియాగాంధీ గతవారం రోజులుగా ఇదే విషయంపై దృష్టి కేంద్రీకరించారని అంటున్నారు. సీనియర్ నాయకులకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూనే యువ నాయకులకు పెద్దపీట వేస్తున్నట్టు తెలిసింది. పునర్వ్యవస్థీకరణలో రాహుల్ ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నారు. ఆయన సూచనలు, సలహాల మేరకే అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని తెలుస్తోంది. ఇప్పుడు ప్రధాన కార్యదర్శులుగా పని చేస్తున్న వారిలో దాదాపు సగంమందిని పదవీ విరమణ చేయిస్తున్నారని అంటున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శులను తొలగిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోనూ యువతకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు సమాచారం.