జాతీయ వార్తలు

అంత ఎత్తు అనుమతించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 11: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్మించనున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ (ట్విన్ టవర్స్) ఎత్తును పరిమితిని మించి అనుమతించటం సాధ్యంకాదని పౌరవిమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు.
శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ భద్రతా ప్రమాణాల కారణంగా విమానాశ్రయ పరిసర భవనాల ఎత్తు నియంత్రించాల్సి వస్తుందన్నారు. ట్విన్ టవర్స్‌కు నిర్దేశిత ఎత్తుకు మించి అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఒక్కొక్కరికి ఒక్కో విధానం ఉండదు. దేశమంతా ఒకే విధానం అవలంబించాల్సి ఉంటుందని సూచించారు. ఆంధ్రలోని గన్నవరం టెర్మినల్ నిర్మాణం కొనసాగుతోందని, ప్రయాణికుల సౌకర్యార్థం అదనంగా మరో భవనం నిర్మిస్తామని చెప్పారు. రన్ వే విస్తరణకు 700 ఎకరాల భూమి అవసరమంటూ, రాష్ట్ర ప్రభుత్వం 400 ఎకరాల భూమి కేటాయించిందని, మరో 300 ఎకరాల భూమి అవసరం ఉందన్నారు. విమానాశ్రయంలో పనిచేస్తున్న భద్రత, కస్టమ్స్ ఇతర సిబ్బందికి సామాజిక న్యాయశాఖ శిక్షణ, వికలాంగులతో ఎలా వ్యవహరించాలనే తీరుపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రయాణికుల రద్దీనిబట్టి ఆంధ్రలో విమానాల సంఖ్య పెంచుతామన్నారు.