జాతీయ వార్తలు

జోక్యం చేసుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: దేశ అత్యున్నత న్యాయస్థాన నిర్వహణ తీరు సక్రమంగా లేదంటూ నలుగురు సీనియర్ న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలపై తాము జోక్యం చేసుకునే ప్రసక్తి లేదని, ఇది న్యాయవ్యవస్థ అంతర్గత విషయమని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విస్పష్టంగా తెలియజేసింది. తమమధ్య ఉన్న విభేదాలను న్యాయమూర్తులే సామరస్యపూరక రీతిలో పరిష్కరించుకోగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. భారత న్యాయవ్యవస్థ అంతర్జాతీయంగా ఖ్యాతి ఉందని, పూర్తిస్థాయి స్వతంత్రతతో పనిచేసే న్యాయవ్యవస్థ ఈ విభేదాలను తనంతట తానుగానే పరిష్కరించుకోగలుగుతుందని న్యాయశాఖ సహాయ మంత్రి పి.పి.చౌదరి తెలిపారు. కాగా, ఇది పూర్తిగా న్యాయమూర్తులే తేల్చుకోవల్సిన అంతర్గత విషయం కాబట్టి ఇందులో ప్రభుత్వ జోక్యానికి ఎలాంటి ఆస్కారం లేదన్న సంకేతాలను అధికార వర్గాలు వ్యక్తం చేశాయి. అయితే ఈ వివాదం ఇలాగే కొనసాగితే న్యాయవ్యవస్థ విశ్వసనీయత పట్ల ప్రజలకు అనుమానాలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి త్వరితగతిన వీటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఈ వర్గాలు స్పష్టం చేశాయి.