జాతీయ వార్తలు

అన్నీ అమలు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో మిగిలిన హామీలను వీలున్నంత త్వరగా అమలు చేయిస్తానని, దీనికోసం ప్రత్యేక చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం మోదీతో దాదాపుగంటసేపుముఖాముఖి చర్చలు జరిపిన అనంతరం విలేఖరుల సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు. ఇంకా అమలు చేయవలసిన విభజన హామీలపై మరింత సమాచారాన్ని అందజేయాలని ప్రధాని కోరారన్నారని, ఆ సమాచారాన్ని త్వరలోనే కేంద్రానికి అందజేస్తామని, ఆ తరువాత కేంద్రం తమవైపునుండి తగిన చర్యలు తీసుకుంటుందనే విశ్వాసం తనకు ఉన్నదని అన్నారు. ఆర్థిక లోటు, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు, శాసనసభలో సీట్ల పెంపు, రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం తదితర అంశాల గురించి మోదీతో లోతుగా చర్చించినట్లు ఆయన వెల్లడించారు. ఇక మిగిలింది ఒక సంవత్సరం మాత్రమేనని, ఈ ఒక్క ఏడాది వీలైనన్ని ఎక్కువ పనులు చేయించుకునేందుకు ప్రయత్నిస్తామని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తమతో సహకరిస్తుందనే చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. మిగిలిపోయిన హామీలను పూర్తిచేయించుకునేందుకు ఓపికతో వ్యవహరించాలని, ఆశతో ముందుకు సాగాలని, తాను అదే పని చేస్తున్నానని ఆయన చెప్పారు. ఇదిలావుండగా, మహారాష్టల్రోని పూణే వెళ్లి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పోలవరం గురించి చర్చించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. కాపర్ డ్యాం సకాలంలో పూర్తికాకపోతే ప్రాజెక్టు నిర్మాణం కూడా సకాలంలో పూర్తికాలేదన్నారు. తెలుగుదేశం, బీజేపీ మధ్య విభేదాలు నెలకొన్నాయని, పొత్తు ఉండకపోవచ్చునంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టివేశారు. కేంద్రంలోని ఎన్టీయే ప్రభుత్వంపై తాను మండిపడాలని, బీజేపీతో పొత్తు తెగతెంపులు చేసుకోవాలన్నది మీ ఆలోచనని, కానీ తాను మాత్రం అభివృద్ధికే పెద్దపీట వేస్తున్నానని ఆయన మీడియా ప్రతినిధులను ఉద్దేశించి అన్నారు. ప్రధాని మోదీతో శుక్రవారం జరిపిన చర్చలు సంతృప్తినిచ్చాయని, వీలున్నంత త్వరగా సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని ఆయన హామీ ఇచ్చారని అన్నారు. విభజన చట్టంలోని మిగిలిన హామీలను త్వరితగతిన అమలు చేసేందుకు ఒక ప్రత్యేక టాస్క్ఫోర్సును ఏర్పాటు చేయాలన్న తన ప్రతిపాదనను కూడా సానుభూతితో పరిశీలించేందుకు ప్రధాని
అంగీకరించారని అన్నారు. రాష్ట్ర విభజన అస్తవ్యవస్తంగా జరగడం వలన ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందనేది మరోసారి ప్రధాని దృష్టికి తెచ్చినట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగింది కాబట్టి కేంద్రం తమకు పెద్ద ఎత్తున చేయూత ఇవ్వాలనేది నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు చంద్రబాబునాయుడు వివరించారు. షెడ్యూల్ 9, 10లోని అంశాలను సక్రమంగా పరిష్కరించలేదనేది ప్రధాని దృష్టికి తెచ్చానని, ప్రత్యేక హోదా స్థానంలో ఇస్తున్న ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకారం కూడా ఏపీకి రావలినన్ని నిధులు రావటం లేదనేది ప్రధానికి వివరించానని చంద్రబాబు తెలిపారు. ప్రత్యేక హోదా మూలంగా ఒనగూరే అన్ని సౌకర్యాలను ప్రత్యేక ప్యాకేజీ కింద ఇస్తామని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అర్థ రాత్రి ప్రకటించారని, కానీ అవి ఇంకా పూర్తిగా అమలు కాలేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక సహాయం కింద వివిధ కేంద్ర పథకాలకు 10:90 నిష్పత్తిలో రాష్ట్రం, కేంద్రం భరించాలనేది మోదీ దృష్టికి తెచ్చినట్లు బాబు తెలిపారు. 10:90 నిష్పత్తిలో రాష్ట్రానికి కేంద్రం నుండి ఐదు సంవత్సరాల్లో 16 వేల 500 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందాలని, కానీ అలా జరగడం లేదనేది ప్రధాన మంత్రికి చెప్పానన్నారు. హౌసింగ్, హడ్కో, నాబార్డ్ లేదా బ్యాంకుల ద్వారా ఈ నిధులు ఇప్పించాలని కోరానన్నారు.

చిత్రం..ప్రధాని మోదీకి రాష్ట్భ్రావృద్ధి ప్రణాళిక పుస్తకాన్ని అందిస్తున్న చంద్రబాబు