జాతీయ వార్తలు

కేసీఆర్‌తో కలిసి పనిచేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన సమస్యలను పరిష్కరించుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో చర్చలు జరిపేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధమేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీల అమలుపై ఆయన చర్చలు జరిపారు. ఆ తరువాత ఆయన విలేఖరులతో మాట్లాడుతూ విభజన తరువాత రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశం కావాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు గతంలోనే సూచించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇదే ఈ అంశాన్ని చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లినపుడు ఆయన స్పందిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రితో చర్చలు జరిపేందుకు తానెల్లప్పుడూ సిద్ధమేనన్నారు. ‘కేసీఆర్‌తో చర్చలు జరిపేందుకు మీరు చొరవ తీసుకుంటారా? అని ఒక విలేఖరి అడగ్గా చొరవ తీసుకోవలసింది నేను కాదు.. కేంద్ర ప్రభుత్వం’ అని ఆయన స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసేందుకు కేంద్రమే చొరవ తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
నాలా ఎవరూ ఒత్తిడితేలేరు
టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం కేంద్రంపై పెద్దగా ఒత్తిడి తీసుకురావటం లేదంటూ వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన ఆరోపణలను
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖండించారు.‘కేంద్రంపై నాకంటే ఎక్కువ వత్తిడి తెచ్చేవారెవరైనా ఉన్నారా?’అంటూ ప్రశ్నించారు. జగన్ ఎక్కడున్నారు? ఆయన చిరునామా ఏమిటి? అంటూ ముఖ్యమంత్రి నిప్పులు చెరిగారు. రాజీనామాలు చేస్తామన్నారు, రాజీనామాలు ఏమయ్యయి? అని ఆయన నిలదీశారు. రాజీనామాల గురించి ఇప్పుడు మాట్లాడమనండి అంటూ చంద్రబాబు సవాల్ చేశారు.‘రాజీనామాల గురించి ఇప్పుడు మాట్లాడటమే మానేశారు? ఎందుకు మానేశారు? ఏమిటి కారణం?‘అని సీఎం అన్నారు. ఏదో ఒకటి మాట్లాడటం జగన్‌మోహన్ రెడ్డికి అలవాటుగా మారిందని ఆయన ఎద్దేవాచేశారు. పోతూ పోతూ ఒక ఫోటో దిగడం, ఏదో మాట్లాడడం ఆయనకు అలవాటేనని బాబు విమర్శించారు.