జాతీయ వార్తలు

ఇస్రో గఘన శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు/ సూళ్లూరుపేట, జనవరి 12: వరుస అంతరిక్ష ప్రయోగాలతో దూసుకెళుతూ విజయం సాధిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొంది... భారతీయులు గర్వపడేలా ఘన చరిత్ర సృష్టించింది...రోదసీ పరిశోధనలో ఇస్రో వినూత్న సరికొత్త రికార్డు సృష్టించింది... వందో ఉపగ్రహ ప్రయోగం విజయం చెందడంతో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకొని అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. అంతరిక్ష ప్రయోగాల వినీలాకాశంలో భారత త్రివర్ణ పతాకం మరోమారు రెపరెపలాడింది. ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. అంతరిక్షంలో భారత్ మరో మైలురాయిని అధిగమించి అగ్రరాజ్యాలకు దీటుగా నిలచింది.
ఒకే రాకెట్ ద్వారా 31 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపి మన శాస్తవ్రేత్తలు సత్తాచాటారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కదనాశ్వం పిఎస్‌ఎల్‌వి-సి 40 మరోసారి విజయబావుటా ఎగరవేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రయోగించిన కార్టోశాట్-2ఇఆర్ ఉపగ్రహం, మన దేశానికే చెందిన మైక్రో ఉపగ్రహం, సూక్ష్మ ఉపగ్రహంతోపాటు ఆరు దేశాలకు చెందిన 28 ఉపగ్రహాలతో కలిపి మొత్తం 31 ఉపగ్రహాలను పిస్‌ఎల్‌వి వాహక నౌక విజయవంతంగా మోసుకెళ్లింది. ఈ ప్రయోగం పయనం 27 నిమిషాల పాటు జరిగింది. దీంతో ఇస్రో వంద ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన ఘనత సాధించింది. ఈ ప్రయోగంతో ఇస్రో
శాస్తవ్రేత్తలు సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ ప్రయోగం కోసం నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీస్ థావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట (షార్)లోని గురువారం ఉదయం 5గంటల 29నిమిషాలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 28గంటలపాటు నిర్విఘ్నంగా కొనసాగింది. ఆ తరువాత శుక్రవారం ఉదయం 9గంటల 29నిమిషాలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి ఎరుపు, నారింజ రంగుల్లో నిప్పులు చిమ్ముకుంటూ పిఎస్‌ఎల్‌వి-సి 40 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ నింగికెగసిన అనంతరం తన నాలుగు దశలను సునాయాసంగా పూర్తిచేసుకొని మరో పిఎస్‌ఎల్‌వి విజయాన్ని నమోదు చేస్తూ పిఎస్‌ఎల్‌వి-సి 40 వాహక నౌక 31 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రోలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. పిఎస్‌ఎల్‌వి-సి 40 వాహక నౌక 17 నిమిషాలకు 710కిలోల బరువు గల ప్రధాన ఉపగ్రహం కార్టోశాట్‌ను 510 కిలోమీటర్ల ఎత్తులో సూర్యానువర్తమాన కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మరో 9నిమిషాల్లో 519 కిలోమీటర్ల ఎత్తు దూరంలో 29 నానో ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా చేరాయి. రాకెట్ నుంచి 30వ ఉపగ్రహం వేరైన తరువాత నాల్గోదశలో ఎర్త్ స్టోరబుల్ లిక్విడ్ ఇంజిన్ 30 నిమిషాల అనంతరం తొలిసారి రీస్టార్ట్ చేశారు. 5సెకండ్ల తరువాత ఇంజిన్ షట్‌ఆఫ్ చేశారు. తదుపరి 45నిమిషాల తరువాత అత్యంత కీలకమైన కోస్టింగ్ పీరియడ్ కొనసాగింది. ఆ సమయంలో ఇంజిన్ రెండోసారి 5సెకండ్లపాటు రీస్టార్ట్ చేశారు. తదుపరి 45నిమిషాల్లో ఇస్రోకు చెందిన మైక్రోశాటిలైట్ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు అమెరికా వంటి అగ్రదేశాలు కూడా ఇలాంటి ప్రయోగాలు చేపట్టలేదు. మన శాస్తవ్రేత్తలు ఇందుకు పూనుకొని వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టడం విశేషం. వీటిలో ప్రధానమైన కార్టోశాట్-2ఇఆర్ 710 కిలోల మిగిలిన 28 ఉపగ్రహాల 613కిలోల బరువు. మొత్తం 31 ఉపగ్రహాలు బరువు1323కిలోలు. పిఎస్‌ఎల్‌వి మూడు దశలను సునాయాసంగా పూర్తిచేసిన అనంతరం నాలుగో దశ స్విచ్ ఆఫ్‌చేసి రాకెట్‌ను మళ్లీ రీస్టార్ట్ చేసి భారత్‌కు చెందిన మైక్రో ఉపగ్రహాన్ని కిందకు తీసుకొచ్చి మళ్లీ పైకి తీసుకెళ్లి రెండో కక్ష్యలోకి చేర్చారు. దీని ద్వారా ఒక కక్ష్యలోకి కాకుండా ఉపగ్రహాలను వివిధ మార్గాల్లో సులువుగా కక్ష్యలోకి చేర్చవచ్చు. మిషన్ కంట్రోల్ సెంటర్‌లో సూపర్ కంప్యూటర్ల ద్వారా రాకెట్ గమనాన్ని చూస్తున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎ.ఎస్.కిరణ్‌కుమార్ రాకెట్ నాలుగు దశలు పూర్తయి ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరిన అనంతరం పిఎస్‌ఎల్‌వి-సి 40 విజయాన్ని అధికారికంగా ప్రకటించి శాస్తవ్రేత్తలతో ఆనందాన్ని పంచుకొని హర్షం వ్యక్తం చేశారు. ఎంసిసి నుంచే ఆయన నేరుగా మాట్లాడుతూ ఒకే రాకెట్ ద్వారా 31 ఉపగ్రహాలు పంపి విజయం సాధించిన ఘనత కొత్త రికార్డు ఇస్రోకు దక్కిందన్నారు. ఈ విజయం శాస్తవ్రేత్తల సమష్టికృషిని ఈ ఏడాది ఇస్రోకు తొలి విజయం శుభపరిణామంగా అభివర్ణించారు. రాకెట్ పయనం 2గంటల 21నిమిషాల సాగిన విజయాన్ని అన్ని ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరిన వెంటనే 27నిమిషాలకు అధికారింగా ప్రకటించి శాస్తవ్రేత్తలు సంబరాలు చేసుకొన్నారు. ఈ ఉపగ్రహం 5సంవత్సరాలు పాటు సేవలు అందించనుంది.

చిత్రం.. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళుతున్న పిఎస్‌ఎల్‌వి-సి 40 ఉపగ్రహం