జాతీయ వార్తలు

ఇది కొత్త ఏడాది కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సూళ్లూరుపేట, జనవరి 12: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయికి చేరువైంది. ఒకేసారి 30 ఉపగ్రహాలతోపాటు తన 100వ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్‌లో శుక్రవారం ఈ ఘనత సాధించింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్తవ్రేత్తలు, అధికారులు సంబరాలు చేసుకొన్నారు. అనంతరం ఇస్రో చైర్మన్ ఎఎస్.కిరణ్‌కుమార్ మీడియా సెంటర్‌లో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కార్టోశాట్-2 విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. ఇది కొత్త సంవత్సరం కానుకగా దేశానికి ఇస్రో ఇచ్చిన కానుకగా ఆయన అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరిలో మార్క్-2 ద్వారా సమాచార సమాచార రంగానికి జీశాట్-11 ఉపగ్రహ ప్రయోగం చేపట్టేందుకు సన్నాహం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది దీంతోపాటు 3జీఎస్‌ఎల్‌వీ, 9 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు కలిపి మొత్తం 12 ప్రయోగాలు ఉంటాయని వెల్లడించారు. చంద్రయాన్-2, సూర్యుని మీదకు ఆదిత్య ఉపగ్రహాన్ని ఈ ఏడాది పంపిస్తామన్నారు. ఇప్పటికే చంద్రయాన్-2 వివిధ రకాల పరీక్షలు కూడా జరిగాయని ఉపగ్రహాన్ని సిద్ధం చేసిన వెంటనే ప్రయోగం ఉంటుదన్నారు. తనకు ఆఖరి ప్రయోగం విజయమే కాకుండా కొత్త చైర్మన్ శివన్‌కు అద్భుత విజయంతో ఘనస్వాగతం పలికామన్నారు. ప్రస్తుతం షార్ నుంచి రెండు ప్రయోగ వేదికల ద్వారా ప్రయోగాలు జరుగుతున్నాయని, మూడో లాంచ్‌ప్యాడ్ కూడా త్వరలోనే సిద్ధమవుతుందన్నారు. పిఎస్‌ఎల్‌విల ద్వారా ఎక్కువ ఉపగ్రహాలను పంపగలుతున్నాం కాబట్టే దేశ, విదేశాల ప్రతినిధులు ఇస్రోను సంప్రదిస్తున్నారని తెలిపారు. చిన్నపాటి సమస్య వల్లే గత ఏడాది ఆగస్టున ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి-సి 39 ప్రయోగం విఫలం చెందిందన్నారు. షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్ మాట్లాడుతూ ఇస్రో వందో ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్తవ్రేత్తల్లో ఉత్సాహాన్ని రెట్టింపు ఇచ్చిందన్నారు. ఇదే ఉత్సాహంతో చంద్రయాన్-2 ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్‌లో షార్ నుంచే మరిన్ని విజయాలు దేశానికి అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్తవ్రేత్తల సమష్టి కృషి ఫలితమే ఇక్కడ ప్రయోగాలు విజయవంతమవ్వడానికి కారణంగా చెప్పారు. ప్రయోగంలో కీలకంగా పనిచేసిన శాస్తవ్రేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు.
‘ఇస్రో ఎంతో ఘనత సాధించింది’
నూతన సాంకేతిక విధాన ప్రయోగాల్లో ఇస్రో ఎంతో ఘనత సాధిస్తుందని కార్టోశాట్-2ఇ ఉపగ్రహ డైరెక్టర్ ఎంఎ.సదానందరావు తెలిపారు. ఇదంతా శాస్తవ్రేత్తల సమష్టి కృషి ఫలితమేనని స్పష్టం చేశారు. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రంలో తక్కువ కాలంలో రూపకల్పన చేశామన్నారు. ఇది భూ పరిశీలన నిమిత్తం ఇస్రో తయారు చేసిందన్నారు. రక్షణ రంగానికి ఇది ఎంతో సేవలు అందిస్తుందన్నారు. నూతన ఇస్రో రథసారధి డాక్టర్ కె.శివన్ మాట్లాడుతూ ఈ విజయం ఒక ప్రత్యేకత చాటుకొందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు, శాస్తవ్రేత్తలు అందరికీ ఆనందంగా ఉందన్నారు. ముందుగా ఆశించిన మేరకే నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాలు చేర్చగలిగామన్నారు. దీంతో మరోసారి ప్రయోగ విజయాల్లో నమ్మకం కలిగిందన్నారు. రాబోయే రోజుల్లో షార్‌కు ప్రపంచంలోనే మొదటి స్థానం సంపాదించడం ఖాయమన్నారు. ఇందులో అమర్చిన హైరిజిల్యూషన్ కెమెరాల ద్వారా భూ భాగంలో మీటరు వ్యాసార్థం కలిగిన ప్రతి చిన్న వస్తువును కూడా సులువుగా కనుగొని ఛాయా చిత్రాలు తీసి పంపుతుందన్నారు. ఈ ఉపగ్రహ రూపకల్పన, ప్రాజెక్టు మొత్తానికి ఇస్రో దాదాపు 494కోట్ల వ్యయాన్ని ఖర్చుపెట్టినట్లు తెలిసింది. కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్.హట్టన్, ఐపిఆర్‌సి డెరెక్టర్ ఎస్.సోమనాధ్, శాస్తవ్రేత్తలు డాక్టర్ వైవిఎన్.కృష్ణమూర్తి, తపన్ మిశ్రా, రాకేష్ శశి భూషణం, ఎస్.పాండియన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఉపగ్రహ, రాకెట్ నమూనాతో ఇస్రో చైర్మన్ ఎఎస్.కిరణ్‌కుమార్