జాతీయ వార్తలు

చైనా కుయుక్తులు సాగనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: భారత దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను అన్ని విధాలుగా పరిరక్షించుకుంటామని సైనికదళాల ప్రధానాధికారి బిపిన్ రావత్ స్పష్టం చేశారు. భారతదేశం భూ భాగంపై ఎవరు ఎలాంటి దాడులకు పాల్పడ్డా గట్టిగా తిప్పికొడతామని ఉద్ఘాటించారు. చైనా శక్తివంతమైన దేశం అయినప్పటికీ భారత్ ఏ విధంగానూ బలహీనమైన దేశం కాదని అన్నారు. భారత దేశం తన దృష్టిని ఉత్తర ప్రాంత సరిహద్దులపై కేంద్రీకరించాల్సిన తరుణం ఆసన్నమైందని రావత్ ఈ సందర్భంగా అన్నారు. ఈ సరిహద్దు ప్రాంతాల్లో చైనా ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడ్డా వాటిని గట్టిగా తిప్పికొట్టగలికే శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంపై తమ పలుకుబడిని పెంచుకోవడంతోపాటు ఆధిపత్యాన్ని కూడా విస్తరించుకోడానికి చైనా గట్టిగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రావత్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే భారత మిత్ర దేశాలను తన వైపుతిప్పుకునేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను కూడా సాగనిచ్చేది లేదని, ఈ విషయంలో వ్యూహాత్మకంగా, దౌత్యపరంగా భారత్ తగిన విరుగుడు చర్యలను చేపడుతుందని హెచ్చరించారు. భారత్ భూ భాగంలోకి చైనా చొరబాట్ల గురించి మీడియా ప్రశ్నించగా‘్భరత్ భూభాగంపై ఎవరు దాడి చేసినా, దురాక్రమణకు పాల్పడ్డా గట్టిగా తిప్పికొడతాం’అని బదులిచ్చారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలని పాకిస్తాన్‌కు అమెరికా చేసిన విజ్ఞప్తిని ప్రస్తావిస్తూ ఈ విషయంలోపాక్ ఏ మేరకు తన వైఖరిని మార్చుకుంటుందో వేచిచూడాల్సి ఉంటుందని రావత్ అన్నారు.

చిత్రం..ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సైనిక దళాల ప్రధాన అధికారి బిపిన్ రావత్