అంతర్జాతీయం

ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న మరో ముగ్గురు వ్యోమగాములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 19: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కు 47వ యాత్రలో భాగంగా మరో ముగ్గురు సిబ్బంది శనివారం ఐఎస్‌ఎస్‌కు క్షేమంగా చేరుకున్నారు. వీరు అయిదు నెలలపాటు ఐఎస్‌ఎస్‌లో గడపడమే కాకుండా అంగారక గ్రహానికి నాసా ప్రయాణానికి దోహదపడే కీలక ప్రయోగాలు నిర్వహిస్తారని అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా తెలియజేసింది. నాసా వ్యోమగామి జెఫ్ విలియమ్స్, రష్యా స్పేస్ ఏజన్సీ రాస్‌కాస్మోస్‌కు చెందిన అలెక్సీ ఒవ్‌చినిన్, ఒలెగ్ స్కిరిపోచ్కాతో కలిసి కజకిస్థాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్‌నుంచి సోయుజ్ టిఎంఏ-20ఎం వ్యోమనౌకలో ఐఎస్‌ఎస్‌కు బయలుదేరారు. నాలుగుసార్లు భూమి చుట్టూ పరిభ్రమించిన తర్వాత వ్యోమనౌక ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమైంది. ఈ ముగ్గురి చేరికతో ఐఎస్‌ఎస్‌లో ఉన్న సిబ్బంది సంఖ్య ఆరుకు చేరుకుంది. ఐఎస్‌ఎస్‌లో మూడుసార్లు అంటే అత్యంత దీర్ఘకాలం గడిపిన తొలి అమెరికా వ్యోమగామిగా విలియమ్స్ ఇప్పుడు అరుదైన రికార్డు సృష్టించినట్లయింది. వీరు ఐఎస్‌ఎస్‌లో ఉండే అయిదు నెలల కాలంలో మొత్తం మానవాళికి ఉపయోగపడే 250కి పైగా సైన్స్ ప్రయోగాలు నిర్వహిస్తారు.