జాతీయ వార్తలు

45 సీట్లయినా ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 26: తమిళనాడులో వచ్చే మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె తమకు చాలా తక్కువ సీట్లు కేటాయించాలని అనుకుంటున్నట్లు వార్తలు రావడంతో రాష్ట్ర కాంగ్రెస్ కనీసం 45 సీట్లన్నా ఇచ్చేలా చూడాలని అనుకోవడమేకాక తమ అభిప్రాయాన్ని సీట్ల పంపిణీపై డిఎంకెతో చర్చలు జరుపుతున్న పార్టీ కేంద్ర నాయకులకు తెలియజేశారు. 234 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో 2011లో తాము పోటీ చేసిన 63 స్థానాలు ఇవ్వాలన్న డిమాండ్‌తో శుక్రవారం డిఎంకెతో చర్చలు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓ మెట్టు దిగివచ్చి 45 సీట్లకు అంగీకరించాలని అనుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.
కాంగ్రెస్ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్, ముకుల్ వాస్నిక్ శుక్రవారం డిఎంకె అధ్యక్షుడు ఎం కరుణానిధితో సీట్ల పంపిణీపై తొలి విడత చర్చలు జరపడం తెలిసిందే. ఆ చర్చల్లో డిఎంకె కాంగ్రెస్‌కు 30 సీట్లు, మహా అయితే ఒకటి, రెండు ఎక్కువ సీట్లకన్నా ఎక్కువ ఇవ్వలేమని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కరుణానిధితో చర్చల అనంతరం ఆజాద్, వాస్నిక్ టిఎన్‌సిసి ప్రధాన కార్యాలయం అయిన సత్యమూర్తి భవన్‌లో రాష్ట్ర సీనియర్ నాయకులతో సమావేశమై డిఎంకె ఆఫర్‌పై చర్చించారు. 45 స్థానాలకయితే ఒప్పుకోవాలని, మహా అయితే ఒకటి, రెండు తగ్గినా పరవాలేదనే భావన చర్చల సందర్భంగా వ్యక్తమయినట్లు పార్టీ నాయకుడొకరు చెప్పారు.
ఐయుఎంఎల్, ఎంఎంకె లాంటి చిన్నాచితకా పార్టీలకు కూడా డిఎంకె అయిదేసి సీట్లు కేటాయించడాన్ని ఆ నాయకుకుడు ప్రస్తావిస్తూ, జికె వాసన్ నిష్క్రమణతో రాష్ట్ర కాంగ్రెస్ బలహీనమైందన్న కారణం చూపి డిఎంకె మమ్మల్ని తక్కువగా అంచనా వేయడం భావ్యం కాదని అన్నారు. అంతేకాదు ఈ ఎన్నికలు మాకన్నా కూడా తమకే ఎక్కువ ముఖ్యమనే విషయాన్ని డిఎంకె అర్థం చేసుకుంటుందన్న నమ్మకం తమకు ఉందని కూడా ఆ నాయకుడు అన్నారు. కేంద్ర మాజీ మంత్రి జికె వాసన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 90వ దశకంలో తన తండ్రి జికె మూపనార్ ప్రారంభించిన తమిళ మానిల కాంగ్రెస్‌ను తిరిగి పునరుద్ధరించిన విషయం తెలిసిందే.