జాతీయ వార్తలు

భూ అధ్యయనంపై నిఘా నేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జనవరి 12: ఇప్పటి వరకు కార్టోశాట్ సిరీస్‌లో ఆరు ఉపగ్రహాలు ప్రయోగించగా ప్రస్తుతం సి-40ద్వారా 7వ శాటిలైట్‌ను నింగిలోకి పంపారు. 710కిలోల బరువు గల ఈ ఉపగ్రహంలో అత్యాధునికమైన కెమెరాలను అమర్చారు. భూమి మీద నిర్ధిష్ట ప్రదేశానికి సంబంధించి హైరిజిల్యూషన్‌చ చిత్రాలను తీసి పంపడం దీని ప్రత్యేకత. కార్టోశాట్-2 సిరీస్‌లో ఇది మూడో ఉపగ్రహం. ఇందులో పాన్‌కొమాటిక్ మల్టీస్పెక్ట్రల్ కెమెరాలు ఉంటాయి. హై రిజిల్యూషన్ డేటాను అందించడంలో వీటికి తిరుగులేదు. పట్టణ, గ్రామీణ, ప్రణాళిక, తీర ప్రాంత వినియోగం, నియంత్రణ, రోడ్డు, నెట్‌వర్క్ పర్యవేక్షణ, నీటి పంపిణీ, భూ వినియోగంపై మ్యాప్‌ల తయారీ, భౌగోళిక మావన నిర్మిత అంశాల్లోమార్పు పరిశీలన వంటి అవసరాలకు ఇది ఉపయోగపడుతోంది. అయిదేళ్ల పాటు సేవలు అందించే ఈ ఉపగ్రహంలో మన పొరుగు దేశాలపై నిత్యం నిఘాచేసి ఉండే సదుపాయం కలుగుతోంది. ఈ కెమెరాలు భూమిపై ఒక మీటరు పరిధిని కూడా స్పష్టంగా చిత్రీకరించి త్వరితంగా నియంత్రణ కేంద్రాలకు పంపగలదు. ఇప్పటికే అంతరిక్షంలో సేవలందిస్తున్న కార్టోశాట్ తరగతికి చెందిన ఉపగ్రహాలు పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని అందించడం గమనార్హం. తాజా కార్టోశాట్ పట్టణ, గ్రామీణ, ప్రాంతాలకు సంబంధించి కచ్చితత్వంతో కూడిన రేఖా చిత్రాలను తయారు చేసే సౌలభ్యం లభిస్తోంది. మన దేశానికి మూడు వైపులా సువిశాలమైన సముద్ర తీరం ఉంది. తీర ప్రాంత భూములు సమర్థ వినియోగం, జలాల పంపిణీ, రహదారి నిర్వహణకు సంబంధించి సమగ్రమైన వ్యవస్థపై దృష్టి తదితర అంశాల్లోనూ సేవలు పొందవచ్చునని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. దేశాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధికి సంబంధించి కచ్చితమైన సమాచారం అందుబాటులోకి రానుంది. దేశంలో ఈ ప్రాజెక్టుల విషయాలు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ ప్రయోగం తీర ప్రాంత భూముల వినియోగం, నీటి సరఫరా తదితర వాటికి ఉపయోగపడుతోంది. మన దేశ భూపరిశీలనకు స్వదేశీ వ్యవస్థ వినియోగంలో భాగంగా కార్టోశాట్-2ఇ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. కార్టోశాట్-2 సీరిస్‌లో ఇది ఏడో ఉపగ్రహ ప్రయోగం. ఇంతకు ముందు పంపిన శాటిలైట్‌లు అన్నీ సేవలు అందిస్తున్నాయి. కార్టోశాట్-2ఇ ఉపగ్రహం ఐదు సంవత్సరాల పాటు సేవలు అందించనుంది.