జాతీయ వార్తలు

పడవ బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 13: మహారాష్టల్రోని దహాను నదిలో శనివారం స్కూలు పిల్లలతో వెళుతున్న ఓ పడవ బోల్తా పడడంతో నలుగురు మరణించారు. అరేబియా సముద్ర సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 32 మంది పిల్లలను రక్షించగలిగినట్టు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ నార్నావారే తెలిపారు. దహాను తీరం సమీపంలో శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగిందని, దుర్ఘటన జరిగిన సమయంలో పడవలో 40 మంది పిల్లలు ఉన్నారని తెలిపారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టామని, 32 మంది సురక్షితంగా బయటకు తీసుకురాగలిగామన్నారు. పర్నాకా బీచ్ నుంచి ఈ పడవ బయలుదేరిందని, తీరం నుంచి రెండు నాటికల్ మైల్స్ వచ్చిన తర్వాత ఈ దుర్ఘటన జరిగిందన్నారు. గల్లంతయిన మిగిలిన వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మితిమీరిన సంఖ్యలో ఈ పడవలో విద్యార్థులను ఎక్కించడం వల్లే అది బోల్తాపడినట్లు తాజా కథనాలను బట్టి తెలుస్తోంది. సహాయక చర్యల్లో భాగంగా మూడు నౌకల్ని, రెండు విమానాలను రంగంలోకి దింపారు.