జాతీయ వార్తలు

ఐదుగురు రెజ్లర్లు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై, జనవరి 13: మహారాష్టల్రోని సాంగ్లి జిల్లాలో శనివారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. వీరిలో ఐదుగురు రెజ్లర్లు ఉన్నారు. మృతులంతా దంగల్‌లోని క్రాంతి కృషి సంకుల్ ఇనిస్టిట్యూషన్‌కు చెందినవారు. సతారాలోని కడెగాన్-సాంగ్లి రోడ్డుపై ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. సాంగ్లి జిల్లాలోని ఔనధ్ గ్రామంలో జరిగిన ఒక పోటీలో పాల్గొన్న అనంతరం వీరంతా తిరిగి వెళ్తుండగా శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వీరి వాహనం ట్రాక్టర్‌ను బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. అయితే, రోడ్డుకు వ్యతిరేక మార్గంలో ట్రాక్టర్ రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, ఇందుకు కారకుడైన డ్రైవర్ పరారీలో ఉన్నాడని, అతనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. కాగా, తమ ఇనిస్టిట్యూట్‌కు చెందిన ఐదుగురు రెజ్లర్లు రోడ్డు ప్రమాదంలో అకాల మృతి చెందడం పట్ల ఇనిస్టిట్యూట్ కార్యదర్శి శరద్ లాడ్ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటన తమకు దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు.

చిత్రం..రోడ్డు ప్రమాదానికి గురైన రెజ్లర్ల కారు వద్ద గుమికూడిన జనం