జాతీయ వార్తలు

ఓటేయనందుకు కాటేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచి, జనవరి 13: రాంచీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తమకు ఓటు వేయనందుకు ఆ కుటుంబానికి చెందిన 13 సంవత్సరాల బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం జరిపి, దారుణంగా హత్యచేశారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తితోపాటు అతని బంధువులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ బాలిక కుటుంబ సభ్యులు నిందితుడి భార్యకు అనుకూలంగా ఓటు వేయకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 8న ఉదయం 6 గంటలటు ఈ బాలిక కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లిందని, అప్పటినుంచీ కనిపించకుండా పోయిందని చెబుతున్నారు. దాంతో ఆ బాలిక తండ్రి అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరునాడు ఆ బాలిక మృతదేహం ఓ అడవి సమీపంలో దొరికింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసిన ప్రేమ్‌లాల్ హన్స్‌దా భార్యకు అనుకూలంగా తాము ఓటు వేయకపోవడంవల్లే ఈ కిరాతకానికి ఒడిగట్టారని బాలిక తండ్రి ఆరోపించాడు. ఈ ఎన్నికల్లో తన భార్య ఓడిపోవడానికి ఈ బాలిక కుటుంబ సభ్యులు ఓటు వేయకపోవడమే కారణమని భావించిన ప్రేమ్‌లాల్ అతని బంధువులతో కలిసి ఈ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ప్రేమ్‌లాల్, ఆయన బంధువులే తన కుమార్తెను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేశారని, అనంతరం బాలికను చంపి బ్లేవన్ అడవి సమీపంలో పడవేశారని బాలిక తండ్రి ఆరోపించాడు. ఇదే విషయాన్ని పోలీసు సూపరింటెండ్ ధ్రువీకరించారు.