జాతీయ వార్తలు

న్యాయ వ్యవస్థ పరిరక్షణకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోచీ, జనవరి 13: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై తిరుగుబాటును జడ్జి కురియన్ జోసెఫ్ సమర్థించుకున్నారు. సీజేఐపై తిరుగుబాటు చేసిన నలుగురు న్యాయమూర్తుల్లో కురియన్ కూడా ఒకరు. శనివారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము లేవనెత్తిన అంశాలు పరిష్కారం అవుతాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. తమ బెంచ్‌లకు ఎంపిక చేసిన కేసులే కేటాయించడం, సుప్రీంలో పరిపాలన గాడితప్పడం వంటి అంశాలనే ఢిల్లీలో తాము ప్రస్తావించామని కురియన్ స్పష్టం చేశారు. న్యాయవస్థను కాపాడి, ప్రజాస్వామ్య మనుగడకు నష్టం కలగకూడదన్నదే తమ ఉద్దేశమని ఆయన చెప్పారు. సుప్రీం కోర్టు పనితీరులో పూర్తి పారదర్శకత ఉంటాలని లేనిపక్షంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని ఆయన అన్నారు. ఇవే అంశాలను తాము ఢిల్లీ మీడియా సమావేశంలో వ్యక్తం చేసినట్టు కురియన్ జోసెఫ్ స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థకు నష్టం జరుగుతోందన్న ఆవేదనతోనే తాము గళం విప్పాల్సి వచ్చిందని ఓ మలయాళం టీవీ న్యూస్‌చానల్‌తో అన్నారు. న్యాయమూర్తి కురియన్ తన పూర్వికుల గ్రామం కలాడే వచ్చిన సందర్భంగా న్యూస్‌చానల్ వెళ్లి కలిసింది. ‘సుప్రీం కోర్టులో జరుగుతున్న వ్యవహారాన్ని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా దృష్టికి తెచ్చినా ఫలితం కనిపింలేదు. అలాంటి పరిస్థితుల్లో అప్రమత్తం చేయాలన్న ఉద్దేశంతోనే మీడియా మందుకొచ్చాం’ అని న్యాయమూర్తి అన్నారు. ప్రజలకు న్యాయవ్యవస్థపై విశ్వాసం కల్గించాలన్నదే తమ ఉద్దేశమని కురియన్ పేర్కొన్నారు. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తులు జే చలమేశ్వర్, రంజన్ గొగోయ్, ఎంబీ లోకూర్, కురియన్ జోసెఫ్ శుక్రవారం ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి సీజేపై విమర్శలు గుప్పించారు. సర్వోన్నత న్యాయస్థానంలో పాలన గాడితప్పుతోందని, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిందిపోయి ఏకపక్షంగా సాగుతోందని జడ్జిలు ఆరోపించారు. పరిస్థితి చక్కదిద్దకపోతే ప్రజాస్వామ్యం మనగలగలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా కోర్టులో పరిస్థితులు పక్కదారిపట్టాయని సుప్రీంలో సెకండ్ సీనియర్ జడ్జి చలమేశ్వర్ ధ్వజమెత్తారు. ఇదే విషయాన్ని కొన్నాళ్ల క్రితమే తాము నలుగురం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశామని అన్నారు.