జాతీయ వార్తలు

కార్తీ నివాసంలో ఈడీ తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. కార్తీ చిదంబరం కార్యాలయం, ఆయన అనుచరులైన పలువురి ఇళ్లపై ఈడీ విస్తృతంగా తనిఖీలు జరిపింది. అలాగే ఢిల్లీలోని కార్తీ తండ్రి మాజీ కేంద్ర మంత్రి చిదంబరం నివాసంలోనూ సోదాలు జరిగాయి. కార్తీ చిదంబరంపై మనీలాండరింగ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది. చైనె్నలో తొమ్మిదిచోట్ల, దక్షిణ ఢిల్లీలోని జోర్‌బాగ్‌లోని చిదంబరం నివాసంలో దాడులు జరిపినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. కార్తీ నివాసం థౌజండ్‌లైట్స్ ప్రాంతంలో సోదాలు చేసినట్టు వారు చెప్పారు. చిదంబరం కుమారుడికి సన్నిహితుడైన ఓ చార్టర్డ్ అకౌంట్, కార్తీ సహాయకుడినీ ఈడీ వదలిపెట్టలేదు. మరోపక్క ఈడీ తనిఖీలు ఓ కామెడీలా చిదంబరం కొట్టిపారేశారు. సోదాలు జరిపిన వట్టిచేతులతో వెళ్లిన ఈడీ అధికారులు తమకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జోర్‌బాగ్‌లో నివాసం వద్ద చిదంబరం మీడియాతో మాట్లాడుతూ ‘డిసెంబర్ 1న కార్తీ, ఆయన బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు జరిపింది. అప్పుడు ఏం ఆధారాలు లభించాయి?’ అని కాంగ్రెస్ నేత ప్రశ్నించారు. ఇదంతా రాజకీయ కక్ష సాధింపుతో చేస్తున్నదేనని ఆయన ఆరోపించారు. అయితే సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ను ఆధారం చేసుకునే తనిఖీలు నిర్వహించినట్టు ఈడీ వెల్లడించింది.

చిత్రాలు..న్యూఢిల్లీ జోర్‌బాగ్‌లోని కార్తీ చిదంబరం ఇంట్లో తనిఖీలు చేసేందుకు వచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.
*సోదాల అనంతరం విలేఖరులతో మాట్లాడుతున్న పి.చిదంబరం