జాతీయ వార్తలు

యూత్ లీడర్స్ బృందానికి శ్రీతేజ నాయకత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 14: సామాజిక, సాంస్కృతిక, మేథో, రాజకీయ అంశాలపై ప్రపంచవ్యాప్తంగా యువకులను ఒకచోటుకు చేర్చి, ప్రతి ఏడాది నిర్వహించే ‘షిప్ ఫర్ వరల్డ్ యూత్ లీడర్స్’ కార్యక్రమానికి భారత్ తరపున వెళ్లే బృందానికి తెలుగు అమ్మాయి యువ న్యాయవాది శ్రీతేజ నాయకత్వం వహించనుంది. జపాన్‌లో జరిగే ఈ కార్యక్రమాని 11 ప్రపంచ దేశాల నుంచి 240 మంది యువ ప్రతినిధులు హాజరుకానున్నారు.
ఇందులో భారత్ తరపున 10 మంది సభ్యుల బృందం పాల్గొననుంది. ఈ కార్యక్రమం 45 రోజులపాటు జరగనుంది. యువతీ యువకుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.