జాతీయ వార్తలు

పరిష్కారం దిశగా మరో అడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 14: దేశ సర్వోన్నత న్యాయ స్థానంలో తలెత్తిన సంక్షోభాన్ని నివృత్తి చేసే చర్యల్లో భాగంగా చైర్మన్ మానన్ కుమార్ మిశ్రా సారథ్యంలో భారత బార్ కౌన్సిల్ బృందం ఆదివారం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను కలుసుకుంది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఏడుగురు సభ్యులతో బార్ కౌన్సిల్ ఓ బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నలుగురు సీనియర్ న్యాయమూర్తులు మీడియా సమావేశంలో మాట్లాడ్డం, ప్రధాన న్యాయమూర్తిపై నేరుగానే విమర్శలు గుప్పించిన నేపథ్యంలో తక్షణ ప్రాతిపదికన ఈ సుప్రీం సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నాలు మొదలయ్యాయి. బార్ కౌన్సిల్ బృందం జస్టిస్ చలమేశ్వర్‌ను కలుసుకుని తాజా పరిస్థితిపై చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే న్యాయమూర్తులు ఎస్‌ఏ. బాబ్దే, ఎల్.నాగేశ్వరరావు కూడా చలమేశ్వర్‌తో చర్చలు జరిపినట్టు అధికార వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ కథనాలు వెలువడ్డాయి. బార్ కౌన్సిల్ బృందం జస్టిస్ చలమేశ్వర్‌ను కలుసుకున్న తర్వాత ఈ ఇద్దరు న్యాయమూర్తులు ఆయనతో భేటీ అయినట్టుగా తెలుస్తోంది.