జాతీయ వార్తలు

బుద్ధుని బోధనలు అనుసరణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై: గౌతమ బుద్ధుడు బోధించిన క్షమాగుణాన్ని ప్రతిఒక్కరూ అనుసరించడం ద్వారా సభ్యసమాజంలో జరుగుతున్న, నేరాలు, హింసాప్రవృత్తులను కొంతవరకైనా తగ్గించవచ్చని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. ఇక్కడి గొరాయి సబర్బన్ బోరివ్యాలీలో గల గ్లోబల్ విపాసన పగొడలో ఆదివారం నిర్వహించిన ‘గ్రాటిట్యూడ్ డే’ కార్యక్రమంలో ఆయన హాజరైన ఆహూతులను ఉద్దేశించి ప్రసంగించారు. మయన్మార్‌కు చెందిన ప్రముఖ విపాసన టీచర్ సయాగ్యి యూ బా కిన్ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నివాళులు అర్పించారు. మానవత్వం పరిమళించేందుకు, సమాజంలో హింసాప్రవృత్తులను పారదోలడానికి బుద్ధుడి బోధనలు ఎంతో ఉపకరిస్తాయని అన్నారు. మంచి సుగుణాలు కలిగేందుకు విపాసనలో నేర్చుకున్న సిద్ధాంతాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో మంచి సుగుణాలు, విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాలు పాదుకొల్పడంలో మహారాష్ట్ర ఎన్నో రకాలుగా గుర్తింపు సాధించిందని, ప్రజల్లో ఈ అంశాలు మరింత లోతుగా తీసుకెళ్లేందుకు, తద్వారా మరింత ప్రాచుర్యం పొందేందుకు ఇంకా కృషి జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్టల్రోని ఎల్లోరా గుహలు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల పర్యాటకులను ఆకర్షించడం సంస్కృతి, సంప్రదాయాల కలబోతకు ఉదాహరణ అని ఆయన అన్నారు. విపాసన వల్ల ఒనగూరే ప్రయోజనాలను ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా విద్యార్థులు చదువులో మరింత దృష్టి సారించేందుకు తద్వారా ఉత్తమ మార్కులు సాధించి వృద్ధిలోకి వచ్చేందుకు ఎంతో దోహపడుతుందని అన్నారు. ప్రభుత్వ అధికారులు, క్రీడాకారులు ఈ విపాసన అంశాన్ని అలవరచుకోవడం వల్ల మానసిక, శారీరక, ఆధ్యాత్మిక రంగాల్లో ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు విపాసన కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా వారిలో నూతనోత్సాహం కల్పించడాన్ని రాష్టప్రతి అభినందించారు. అంతకుముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ విపాసన టీచర్ సయాగ్యి యూ బా కిన్, సత్యనారాయణ్ గొయెంకా, ఇలైచీదేవీ గోయెంకా తదితరులు విపాసన కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం కావడానికి అందించిన సేవలను ప్రస్తుతించారు.

చిత్రం..గ్లోబల్ విపాసన పగొడలో ఆదివారం నిర్వహించిన కార్య క్రమానికి విచ్చేసిన
రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు జ్ఞాపికను అందజేస్తున్న దృశ్యం