జాతీయ వార్తలు

వరాల బడ్జెట్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: దేశంలోని మధ్య తరగతి ప్రజల మద్దతు కూడగట్టాలనుకుంటున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 2018-19 వార్షిక ప్రణాళికలో ఆదాయం పన్ను పరిమితిని రెండున్నర లక్షల నుండి మూడు లక్షల రూపాయలకు పెంచే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆదాయం పన్ను పరిమితిని పెంచే అంశంపై ఆర్థిక శాఖ సీనియర్ అధికారులతో సమాలోచనలు జరుపుతున్నారు. ఆరుణ్ జైట్లీ ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం పదకొండు గంటలకు లోక్‌సభలో 2018-19 సంవత్సరం వార్షిక ప్రణాళికను ప్రతిపాదించనున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 29 నుండి ప్రారంభం అవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు 2019లో జరుగనున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదాయం పన్ను పరిమితిని పెంచటంపై దృష్టి సారించటం గమనార్హం. మోదీ ప్రభుత్వం ఆదాయం పన్ను పరిమితిని రెండున్నర లక్షల నుండి మూడు లక్షల రూపాయలకు పెంచటంతోపాటు వార్షికాదాయం పది లక్షలు, అంతకంటే అధికంగా ఉంటే విధించే ముప్పై శాతం పన్నును ఇరవై ఐదు శాతానికి తగ్గించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనల గురించి జైట్లీ ఇదివరకే నరేంద్ర మోదీతో ప్రాథమిక చర్చలు జరిపారనీ, మోదీ పచ్చజెండా ఊపిన తరువాతే ఆయన ఆర్థిక శాఖ సీనియర్ అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆరుణ్ జైట్లీ ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రతిపాదించే పూర్తి స్థాయి బడ్జెట్ ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఆఖరు బడ్జెట్ అవుతుంది. 2019లో ఎన్నికలకు ముందు ఓట్ ఆన్ అకౌంట్ మాత్రమే ప్రతిపాదించేందుకు అవకాశం ఉంటుంది. అందుకే ప్రస్తుతం తిపాదించే బడ్జెట్ ఎన్‌డీఏ ఎన్నికల బడ్జెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆదాయం
పన్ను పరిమితిని పెంచటం, స్లాబ్ రేటును తగ్గించటంతోపాటు అరుణ్ జైట్లీ ఇతర రంగాల్లో కూడా పలు రాయితీలు, తాయిలాలు ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు. పది లక్షలు అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారి పన్ను స్లాబ్ తగ్గించటం కంటే పన్నుస్లాబుల్లో మార్పులు చేయాలని బీజేపీ అధినాయకత్వం కోరుతున్నట్లు తెలిసింది. ఆ విధంగా ఆదాయం పన్ను స్లాబుల్లో మార్పులు చేయటం సాధ్యం కాదు కాబట్టే ఆదాయం పన్ను పరిమితిని పెంచటంతోపాటు ఆఖరు స్లాబ్‌ను 30 నుండి ఇరవై ఐదు శాతానికి తగ్గించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారని అంటున్నారు. ప్రజలపై పడుతున్న పన్నుల భారాన్ని హేతుబద్దం చేయటంతోపాటు వౌలిక సదుపాయాల రంగానికి అవసరమైన నిధుల సమీకరణ జరిగేలా పన్నుల విధానం ఉండాలని మోదీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ద్రవ్యోల్బణం మూలంగా మధ్యతరగతి ప్రజలపై భారం రోజురోజుకూ పెరుగుతోంది, ఈ భారాన్ని కొంతైనా తగ్గించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఆదాయం పన్ను రాయిలతీలపై దృష్టి సారించిందనే మాట వినిపిస్తోంది. పన్ను భారం తగ్గటంవలన ప్రజల వద్ద నగదు పెరిగితే దీనివలన కొనుగోళ్లు పెరిగి వ్యాపారం పుంజుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. వ్యాపారం, సేవారంగం పెరగటం వలన ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయి, ఇది ఆర్థికాభివృద్ధికి దారి తీస్తుందన్నది ప్రభుత్వం వాదన.
బ్యాంకుల ఎఫ్‌పీలు (్ఫక్స్‌డ్ డిపాజిట్)లకు పన్ను రాయితీ ఇచ్చే ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. పొదుపును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మ్యూచువల్ ఫండ్స్‌కు పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిసిందే. మ్యూచువల్ ఫండ్స్‌కు ఇచ్చినట్లే ఎఫ్‌డీలకు కూడా పన్ను మినహాయింపు ఇవ్వటంద్వారా పొదుపును ప్రోత్సహిస్తే బ్యాంకుల్లో నగదు నిల్వలు బాగా పెరుగుతాయని కేంద్ర ఆర్థిక శాఖ భావిస్తోంది. బ్యాంకుల్లోకి వచ్చే నగదును రుణాల రూపంలో ఇవ్వటంద్వారా ఆర్థిక కార్యక్రమాలను బాగా పెంచవచ్చునన్నది ప్రభుత్వం ఆలోచన. కొన్ని ఎంపిక చేసిన సెక్యూరిటీలపై ఎస్‌టీసీజీ (షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్) హోల్డింగ్ కాలాన్ని ఒక ఏడాది నుండి మూడేళ్లకు పెంచే ప్రతిపాదన కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉంది.