జాతీయ వార్తలు

ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: మణిపూర్‌లో బూటకపు ఎన్‌కౌంటర్ల కేసుల విచారణలో కొనసాగుతున్న జాప్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. హింసను అణచివేత పేరుతో సైన్యం, అస్సాం రైఫిల్స్, రాష్ట్ర పోలీసులపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ల పురోగతిని ప్రశ్నించిన సుప్రీం కోర్టు సీబీఐ, సిట్‌లపై మండిపడింది. గతంలో కోర్టు ఆదేశించినా ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేయకపోవడాన్ని జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ యుయు లలిత్‌తో కూడిన ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెలాఖరునాటికి మరో 30 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని బెంచ్ ఆదేశించింది. ఇప్పటి వరకూ 12 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్టు సిట్ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఫిబ్రవరి 28 నాటికి బూటకపు ఎన్‌కౌంటర్ల కేసులో విచారణ పూర్తిచేయాలని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఇప్పటివరకూ నమోదైన 12 కేసుల్లో విచారణ పూర్తిచేసి తుది నివేదిక సంబంధిత కోర్టుకు అందజేయాలని బెంచ్ ఆదేశించింది. సిట్ దర్యాప్తు తీరుతెన్నులను బెంచ్ ప్రశ్నించింది. గత ఏడాది జూలై 14న ఆదేశించినా ఎఫ్‌ఐఆర్‌ల నమోదులో ఎందుకింత జాప్యం జరుగుతోందని సుప్రీం నిలదీసింది. అన్ని కేసుల్లోనూ విచారణ ముగించి సీబీఐ డైరెక్టర్ ఆమోదం కోసం పంపాలని ధర్మాసనం సూచించింది. అలాగే దర్యాప్తుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీబీఐను కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణ మార్చి 12కు వాయిదా పడింది. మణిపూర్‌లో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్ల విషయాన్ని సిట్ తీవ్రంగా పరిగణించడంలేదంటూ గత విచారణ సందర్భంలో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. బూటకపుఎన్‌కౌంటర్లపై విచారణకు ఐదుగులు సీబీఐ అధికారులతో ఓ ప్రత్యేక దర్యాపుబృందాన్ని (సిట్)ను సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. 1,528 ఎన్‌కౌంటర్లపై సమగ్ర దర్యాప్తు జరపాలంటూ దాఖలైన పిల్‌పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని సుప్రీం ఆదేశించింది. 81 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి విచారించాలని స్పష్టం చేసింది.