జాతీయ వార్తలు

మెడికల్ సీట్లు మరిన్ని పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: దేశంలో అర్హులైన విద్యార్థులకు వైద్యవిద్యను అందుబాటులోకి తేవాలని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ స్పష్టం చేశారు. మెడికల్ సీట్ల కొరతను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని మంగళవారం ఇక్కడ ఉద్ఘాటించారు. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (ఎయిమ్స్) 45వ స్నాతకోత్సవంలో రాష్టప్రతి ప్రసంగించారు. సీట్ల పెంపునకు సంబంధించి ఎదురవుతున్న అడ్డంకులను వివిధ మార్గాల ద్వారా అధిగమించాలని ఆయన సూచించారు. ప్రజలకు వైద్యాన్ని చేరువ చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. వైద్యుల కొరతను తీర్చాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ‘దేశ ప్రజలకు అవసరమైన వైద్యం అందాలి. దీని కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని రాష్టప్రతి పిలుపునిచ్చారు. మెడికల్ సీట్లు మరింత పెంచడం ద్వారా మరింత మంది డాక్టర్లు అందుబాటులోకి వస్తారని తద్వారా సమాజానికి మెరుగైన వైద్యం దొరుకుతుందని కోవింద్ స్పష్టం చేశారు. ‘దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాల్లో 67,000 అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు ఉన్నాయి. పీజీలో 31,000 సీట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయినా సరిపోవు. అర్హతగల విద్యార్థులకు మరిన్ని మెడికల్ సీట్లు లభించాలి. వాటిని అందుబాటలోకి తీసుకురావాలి’ అని ఆయన అన్నారు. 1.3 బిలియన్ జనాభాకు ఈ సీట్లు ఎంత మాత్రం సరిపోవని రాష్టప్రతి చెప్పారు. వైద్యవిద్యపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు. ఏటా మరింత ఎక్కువ మంది కొత్త డాక్టర్లు కళాశాల నుంచి బయటకు వస్తే సమాజం అవసరాలు తీరతాయని ఆయన తెలిపారు. అంతే కాకుండా వైద్యవిద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని ఆయన అన్నారు. దేశంలోనే సరిపడా మెడికల్ సీట్లు ఉంటే విదేశాలకు వెళ్లరని ఆయన ఉద్ఘాటించారు. ‘తక్షణం ఈ విధానం మారాలి. దేశంలోని కాలేజీల్లోనే మెడికల్ సీట్ల సంఖ్య పెరగాలి. అలాగే విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవాలి’ అని రాష్టప్రతి విజ్ఞప్తి చేశారు. ఎయిమ్స్‌పై రాష్టప్రతి కోవింద్ ప్రశంసలు కురిపించారు. ఎయిమ్స్ ఫ్యాకల్టీ అంకితభావం, మెరుగైన వైద్యంతో దూసుకుపోతోందని ఆయన అన్నారు. ఫ్యాకల్టీ, వైద్యులు, మెడికోలు, కోర్సులు వైద్య రంగానికే కాదు యావత్‌జాతికి గర్వకారణంగా రాష్టప్రతి పేర్కొన్నారు.
ఎయిమ్స్‌లోని ప్రతి సభ్యుడినీ తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు కోవింద్ ప్రకటించారు. పేద, ధనిక తేడాలేకుండా అందరికీ నాణ్యమైన వైద్యం అందాలని రాష్టప్రతి ఆకాంక్షించారు. దురదృష్టవశాత్తూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షగా మిగిలిపోయిందని ఆయన ఆవేదన చెందారు. ‘మీరు అందించే వైద్యం రోగి, వారి కుటుంబ సభ్యుల్లో విశ్వాసం కలిగించాలి. వారు మళ్లీ మీ దగ్గరకు వచ్చేలా ఉండాలి. రోగి పట్ల మీరు చూపే ఆప్యాయత, సేవలకు వెలకట్టలేం. దాన్ని గుర్తెరగాలి’ అని వైద్యులను ఉద్దేశించి కోవింద్ స్పష్టం చేశారు.