జాతీయ వార్తలు

రాహుల్‌కు నిరసనల సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమేథీ, జనవరి 16: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్న విస్తృత లక్ష్యంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేపట్టిన రెండురోజుల అమేథీ యాత్ర రెండోరోజు నిరసనల మయంగా సాగింది. దీని కారణంగా రాహుల్ తన పర్యటన మార్గాన్ని మార్చుకోక తప్పని పరిస్థితులు తలెత్తాయి. పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత తొలిసారిగా యుపిలో అడుగుపెట్టారు. ఆయన సొంత నియోజకవర్గమైన అమేథీలో బిజెపి మద్దతుదారులు తీవ్ర స్థాయిలో నిరసనలతో పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా గౌరీగంజ్ ప్రాంతంలో కాంగ్రెస్, బిజెపి మద్దతుదారుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు చెలరేగాయి. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని రాహుల్ పర్యటన మార్గాన్ని మార్చారు.
రాహుల్ పర్యటన మొదటిరోజు ఎలాంటి అవరోధాలు లేకపోయినా రెండోరోజు మాత్రం ఘర్షణల కారణంగా గందరగోళమయంగా సాగింది. ఎప్పుడైతే గౌరీగంజ్ ఘర్షణల తీవ్రత పెరిగిందో రాహుల్‌గాంధీ పర్యటన మార్గాన్ని మార్చారు. ముందు అనుకున్న ప్రకారం ఆయన ముసాఫిర్‌ఖానా నుంచి గౌరీగంజ్ చేరుకోవాల్సి ఉంది. అయితే మార్గమధ్యలో బిజెపి నేతలు బైఠాయించారు. ‘ఈ మార్గంలో రాహుల్‌గాంధీ వెళ్లడానికి మేము ఎంతమాత్రం ఒప్పుకోం’ అని తెగేసి చెప్పారు.
దాంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని, అందుకే రాహుల్ పర్యటన మార్గాన్ని మార్చామని అదనపు ఎస్‌పి బి.సి.దుబే తెలిపారు. జామో రోడ్డు మార్గం ద్వారా రాహుల్‌గాంధీ గౌరీగంజ్‌కు చేరుకున్నారు. ఇరువైపులా కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. గౌరీగంజ్ - ముసాఫిర్‌ఖానా మార్గంలో మిస్సింగ్ ఎంపీ అంటూ అనేకచోట్ల ప్లకార్డులు ప్రదర్శించారు. రాహుల్‌గాంధీ తన నియోజకవర్గ ప్రజల వైద్య, ఇతర అవసరాలను విస్మరిస్తున్నారని కేవలం ప్రారంభం కాని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తున్నారని ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. రాహుల్ రాయ్‌బరేలీ వెళ్లినప్పుడు కొందరు బిజెపి నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీని కారణంగా తన తండ్రి రాజీవ్‌గాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేయలేకపోయారు. తొలి రోజు కూడా కాంగ్రెస్, బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణలు జరగడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

చిత్రాలు..కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా సొంత నియోజకవర్గమైన అమేథీ పర్యటనకు విచ్చేసిన రాహుల్‌కు నిరసనల సెగ తగిలింది. రాహుల్ రోడ్‌షోను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో వేరే మార్గంలో గౌరీగంజ్‌కు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యం.