జాతీయ వార్తలు

పాఠశాలలకు డిజిటల్ బోర్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గురుకుల పాఠశాలలను అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ సూచించారు. ఢిల్లీలో రెండు రోజులపాటు 65వ కేంద్ర విద్యా సలహా మండలి (కేబ్) సమావేశం జరిగింది.
ప్రకాశ్ జావడెకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రు లు మేనకా గాంధీ, తవర్‌చంద్ గెహ్లాట్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్, సత్యపాల్ సింగ్, వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యా శాఖ మంత్రులు పాల్గొన్నారు. అనతంరం కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ విలేఖరులతో మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో దేశంలోని అన్ని పాఠశాలలకు డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. దీనిద్వారా క్రియాశీలక చర్యలు, ప్రణాళికలతో నాణ్యమైన విద్య అందరికీ అందించడంతోపాటు స్వచ్చ్భారత్, ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్, సుగమ్య భారత్ వంటి కార్యక్రమాలకు ప్రచారం కల్పించడం జరుగుతుందని చెప్పారు. మానవ విలువలు, జీవన నైపుణ్యాలు అందించే విద్యను పోత్సహించడం ప్రధాన ధ్యేయంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న గురుకుల పాఠశాలలను మంత్రి ప్రకాశ్ జావడేకర్ ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత బడ్జెట్‌తో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 8 లక్షల మంది విద్యార్థులకు నవోదయ లాంటి రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఈ పాఠశాలలను అన్ని రాష్ట్రాల ప్రతినిధులు, విద్యా శాఖ మంత్రులు సందర్శించి వారి వారి రాష్ట్రాలలో ఏర్పాటు చేసుకునే విషయాన్ని అధ్యయనం చేయాలని ఈ సమావేశంలో సూచించినట్టు జావడెకర్ తెలిపారు.