జాతీయ వార్తలు

శంకుస్థాపనలతోనే సరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఛాపాద్రా (రాజస్థాన్), జనవరి 16: పథకాల పేరుతో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలను మోసం చేసిందని ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ఇక్కడ తీవ్రంగా విమర్శించారు. పథకాలంటూ శంకుస్థాపనలు, శిలాఫలకాలకే వారి కార్యక్రమాలుండేవని వాస్తవానికి పేదలకు వొనగూరింది ఏమీ లేదని ఆయన ధ్వజమెత్తారు. రూ. 43,129 కోట్ల రూపాయలతో చేపట్టిన బార్మేర్ రిఫైనరీ ప్రాజెక్టు పనులను మోదీ ప్రారంభించారు. ప్రజల సంక్షేమం కాంగ్రెస్‌కు పట్టేది కాదని ప్రధాని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ పనితీరును బేరీజువేసుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ‘మేం అధికారంలోకి వచ్చాకే అభివృద్ధి జరుగుతోంది’ అని ఆయన అన్నారు. రిఫైనరీ కూడా తమ ఘనతేనని ఆయన చెప్పారు. ‘ఇక్కడే కాదు. దేశమంతా ఇదే తంతు నడిచింది. శంకుస్థాపనలు చేయడం.. ఆనక వదిలేయడం’ అని కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. రాజకీయ ప్రయోజనాల కోసం హడావుడిగా రైల్వే లైన్లు ప్రకటించడం తరువాత వదలేయడం వారి నైజమని విమర్శించారు. ఒక విధంగా ప్రకటనలతోనే ప్రజలను మోసం చేసేవారని అన్నారు. 2014 ఎన్నికల ముందు రక్షణశాఖ ఉద్యోగుల కోసం ఒన్ మేన్- ఒన్ పెన్షన్ (ఓఆర్‌ఓపీ) ప్రకటించారని మోదీ గుర్తుచేశారు. రాజకీయంగా లబ్ధి పొందడానికే మధ్యంతర బడ్జెట్‌లో 500 కోట్లు ప్రకటించారని ఆయన విమర్శించారు. ‘బార్మేర్ రిఫైనరీ, ఓఆర్‌ఓపీ కూడా ఎక్కడా పేపర్లపై లేదు. ఇది కాంగ్రెస్ పనితీరు’ అని ప్రధాని ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో ఎక్కడా అధ్యయనం చేయకుండా ప్రచారం కోసం పథకాలు ప్రకటించడం కాంగ్రెస్‌కు అలవాటని మోదీ ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 12000 కోట్లతో ఓఆర్‌ఓపీని అమలుచేసిందని ఆయన గుర్తుచేశారు. తొలివిడతగా ఇప్పటికే 10,700కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు ఆయన పేర్కొన్నారు. మిగిలిన మొత్తం త్వరలోనే రక్షణశాఖ ఉద్యోగులకు అందుతుందని ఆయన వెల్లడించారు. గరీబీ హటావో అన్నది కాంగ్రెస్ ఓ నినాదంగానే చూసిందని ప్రధాని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం నిరుపేదలకు ఎల్‌పీజీ కనెక్షన్లు ఇవ్వడంతోపాటు పేద మహిళలు ఉచితంగా విద్యుత్ కనెక్షన్ ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు. దేశంలో ఇప్పటికీ నాలుగు కోట్ల ఇళ్లకు విద్యుత్ సదుపాయమే లేదని ఆయన అన్నారు. కాగా సోనియాగాంధీ 2013 సెప్టెంబర్ 22న రిఫైనరీకి శంకుస్థాపన చేస్తే ప్రధాని మోదీ తిరిగి శంకుస్థాపన చేశారని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. అయితే బీజేపీ తన చర్యను సమర్థించుకుంది. 2013 ఎన్నికల్లో ప్రయోజనం కోసమే హడావుడిగా శంకుస్థాపన చేశారని కేంద్ర ఇంధన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ముఖ్యమంత్రి వసుంధర రాజే అన్నారు. అప్పటికి భూ సేకరణ అలాగే పర్యావరణ అనుమతులు ఏవీ లేవని వారు చెప్పారు. మంగళవారం నాటి కార్యక్రమంపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. అల్వార్, అజ్మీర్ లోక్‌సభ, మంగళ్‌గఢ్ అసెంబ్లీ సీట్లకు ఈనెల 29న ఉప ఎన్నికలు జరగనుండగా దీన్ని చేపట్టారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

చిత్రం..బార్మేర్‌లో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ