జాతీయ వార్తలు

అన్ని రంగాల్లో భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవ్ దోలేరా, జనవరి 17: ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ముఖచిత్రానే్న మారుస్తున్నారని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రశంసించారు. భారత్‌ను అంతర్జాతీయ శక్తిగా మార్చాలన్న అకుంఠిత దీక్షతో మోదీ పనిచేస్తున్నారని చెప్పిన ఆయన అన్ని రంగాల్లోనూ భారత్‌తో భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటామని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ యువత భారత్‌కు వచ్చి ఇక్కడ జరుగుతున్న మార్పులను ఆకళింపు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ కూడా అన్ని రంగాల్లోనూ కొత్త ఆవిష్కరణలకు నాందీ ప్రస్తావన చేస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎప్పటికప్పుడు కొత్త వ్యవస్థలను పాదుకొల్పుతూ భారత్‌కు సహకరిస్తోందని తెలిపారు. బుధవారం ఇక్కడ జరిగిన ఔత్సాహిక పారిశ్రామిక, సాంకేతిక విజ్ఞాన అంతర్జాతీయ కేంద్రం (ఐ-క్రియేట్)ను ప్రారంభించిన అనంతరం ఇరు దేశాల ప్రధానులు మాట్లాడారు. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో పనిచేసే సంస్థ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భిన్న రంగా ల్లో రాణించడానికి అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తుంది. ఈ సందర్భంగా మాట్లాడిన నెతన్యాహు ఇరు దేశాల యువత తమ క్రియాశీలతతో సృజనతో ముందుకు రావాలని కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. భారత ప్రధాని మోదీ దేశంలో అనూహ్యమైన మార్పులు తెస్తున్నారని, విప్లవాత్మక రీతిలో భారత భవిష్యత్ పథాన్ని నిర్దేశిస్తున్నారని తెలిపారు. ఇదంతా కూడా సరికొత్త ఆవిష్కరణల శక్తితోనే మోదీ
సాధిస్తున్నారని నెతన్యాహు పేర్కొన్నారు. 2011లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ ఐ-క్రియేట్‌ను ప్రారంభించారు. ఇప్పుడు దాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో జాతికి అంకితం చేయించారు. ఈ సంస్థ స్టార్టప్‌లను ప్రారంభించడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలుగా సహకరిస్తుంది. ఈ సంస్థ ద్వారా ఒనగూడే విజ్ఞానాన్ని భారత్‌తో కలిసి పనిచేసి సమకూర్చుకోవాలని నెతన్యాహు అన్నారు. నరేంద్ర మోదీ భవిష్యత్ దృక్పథం, ఆయన స్నేహం ఇరు దేశాల మధ్య పరస్పర భాగస్వామ్యానికి అనంతమైన అవకాశాలను ఇస్తోందని తెలిపారు. ఐ-క్రియేట్ సంస్థలో పొందుపరిచిన ఆవిష్కరణలు తనను మంత్రముగ్ధుల్ని చేశాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఐ-పోడ్స్, ఐ-పాడ్స్ గురించే ప్రపంచానికి తెలుసునని, ఇప్పుడు కొత్తగా ఐ-క్రియేట్ అన్న వ్యవస్థ ఆవిష్కృతమైందని అన్నారు. ‘నేను, భారత ప్రధాని మోదీ ఆలోచనల్లో యువకులం. మాకు భవిష్యత్తు పట్ల నమ్మకం, విశ్వాసం ఉన్నాయి’ అని నెతన్యాహు పేర్కొన్నప్పుడు మోదీ నవ్వడం కనిపించింది. సాంకేతిక విజ్ఞానం, జలవనరులు, వ్యవసాయం, సైబర్, ఆరోగ్య రంగం, జీవశాస్త్రాలు ఇలా ఒకటేమిటి అన్ని రంగాల్లోనూ భారత్‌తో భాగస్వామ్యాన్ని పెంచుకోవాలన్నది తమ లక్ష్యమని తెలిపారు.
నెతన్యాహు సమక్షంలో ఐ-క్రియేట్ సంస్థ జాతికి అంకితం కావడం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని మోదీ అన్నారు. ఇరు దేశాల మధ్య ఈ ఫౌండేషన్ బలమైన మైత్రీ బంధానికి పునాది కావాలని గత ఏడాది ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా తాను నిర్ణయించుకున్నానన్నారు. అప్పటినుంచీ నెతన్యాహు భారత రాక కోసం ఎదురుచూశానని తెలిపారు. తమతమ దేశాల్లోని అన్ని వ్యవస్థలు సరికొత్త సృజనకు దోహదం చేసేవిగా ఉండాలన్నదే ఆశయమన్నారు. ఈ రకమైన ఆవిష్కరణల వల్ల నవభారత నిర్మాణానికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. ఒక దేశం ముందుకు వెళ్లాలంటే ఎంత పెద్దదన్నది ప్రామాణికం కాదని, ఆయా దేశాల్లో నివసిస్తున్న ప్రజలు ఎంత సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారన్నదే కీలకమని తెలిపారు. భారత్-ఇజ్రాయెల్ ప్రజలు సృజన, సృజనాత్మకత విషయంలో కలిసికట్టుగా పనిచేస్తున్నారని, అంకితభావంతో ముందుకు సాగుతున్నారని మోదీ తెలిపారు. ఐ-క్రియేట్ ఫౌండేషన్ ద్వారా భారత్‌లో సరికొత్త ఆవిష్కరణలకు మరింత ఊతం లభిస్తుందని, అదే విధంగా కొత్త పరిశ్రమల ఆవిర్భావానికి ఇది దోహదం చేయగలదని ఆశిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు 38 పారిశ్రామిక ప్రాజెక్టులకు అవార్డులను అందించారు. వీటిలో 18 భారత్‌వి కాగా, 20 ఇజ్రాయెల్‌కు చెందినవి.

చిత్రం..ఐ క్రియేట్ వేదికపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భారత ప్రధాని నరేంద్ర మోదీ