జాతీయ వార్తలు

కొత్త పార్టీ ఏర్పాటు ఇప్పుడే కాదు: దినకరన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదకమండలం, జనవరి 17: కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాల్సిన తక్షణ అవసరం తనకు లేదని అన్నా డిఎంకే బహిష్కృత నేత, ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ బుధవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. అయితే, అన్నాడిఎంకెను ‘అన్నాడిఎంకె (అమ్మ) పార్టీ’గా గుర్తించాలని తాను ఇప్పటికే కోర్టును ఆశ్రయించానని వివరించారు. వీకే శశికళను పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగిస్తూ అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం తీసుకున్న నిర్ణయాన్ని తాను మద్రాస్ హైకోర్టులో సవాల్ చేశానని, కేసు ఇంకా విచారణలో ఉందని దినకరన్ గుర్తుచేశారు. పార్టీని అన్నాడీఎంకే (అమ్మ)గా నడిపేందుకు కోర్టు నుంచి అనుమతి రావాల్సి ఉందన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వమ్ వర్గాలు కలిసిపోవడంతో అన్నాడిఎంకెలో శశికళ అనుచరులు ప్రస్తుతం దినకరన్ వెంట ఉన్నారు. పళని, పన్నీర్‌ల సారథ్యంలో ఉన్న అన్నాడిఎంకెకు రెండాకుల గుర్తును ఎన్నికల సంఘం కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా ఆర్‌కె నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దినకరన్ తన వర్గాన్ని కాపాడుకునేందుకు పావులు కదుపుతున్నారు. తమ వర్గాన్ని ‘అన్నాడిఎంకె (అమ్మ)’ పార్టీగా గుర్తించాలని కోర్టును ఆశ్రయించినందున కొత్తగా పార్టీని ఏర్పాటు చేయాల్సిన తక్షణ అవసరం లేదని దినకరన్ చెబుతున్నారు. అన్నాడిఎంకె పేరును, రెండాకుల గుర్తును సాధించడమే తన ప్రస్తుత ధ్యేయమన్నారు. అసెంబ్లీలో బలనిరూపణ జరిగినపుడు అన్నాడిఎంకెలోని తన అనుచరులంతా బయటకు వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బల నిరూపణకు అవకాశం వస్తే ఎంతోమంది ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తనకు మద్దతు పలుకుతారని ఆయన అన్నారు.