జాతీయ వార్తలు

భారీగా పెరగనున్న ఎన్నికల కమిషనర్ల జీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 17: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కమిషనర్లు ముగ్గురి జీతాలు రెండింతలు పెరగనున్నాయి. కొద్ది వారాల్లోనే వారీ పెరిగిన వేతనాలు అందుకుంటారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌తోపాటు ఇద్దరు కమిషనర్ల జీతాలు సుప్రీం కోర్టు జడ్జీల జీతాలతో సమానంగా ఇవ్వాలని నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల జీతాల పెంపునకు సంబంధించిన బిల్లు ఇటీవల లోక్‌సభ శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందింది. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే రాజ్యసభ బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ఆమోదం తెలపాల్సి ఉంది. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం తరువాత రాష్టప్రతికి పంపుతారు. రాష్టప్రతి ఆమోద ముద్ర పడిన వెంటనే పెరిగిన జీతాలు అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నెల జీతం లక్ష రూపాయలు. కొత్తగా పెరిగిన జీతాలు అమల్లోకి వస్తే సీజేఐకు నెలకు 2 లక్షల 80 వేల రూపాయల వేతనం అందుతుంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు నెలకు 2.50 లక్షల రూపాయలు అందుతాయి. ప్రస్తుతం వారికి 90వేల జీతం వస్తోంది. ఇప్పుడు నెలకు 80వేల రూపాయల వేతనం తీసుకుంటున్న హైకోర్టు జడ్జీలకు 2.25 లక్షల రూపాయలు అందుతాయి. జడ్జీలకు కొత్త వేతనాలు అమల్లోకి వచ్చిన మరుక్షణమే ఎన్నికల కమిషన్ల జీతాలు పెరుగుతాయని న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి. అంటే సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతోపాటు ముగ్గురు కమిషనర్లకు సమాన వేతనం అంటే నెలకు రెండున్నర లక్షల రూపాయలు చెల్లిస్తారు.