జాతీయ వార్తలు

సుప్రీంను ఆశ్రయంచిన ‘పద్మావత్’ నిర్మాతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 17: సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా చిత్రం విడుదలపై కొన్ని రాష్ట్రాలు నిషేధం విధించడంపై ‘పద్మావత్’ నిర్మాతలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను అత్యవసరమైనదిగా పరిగణిస్తూ విచారణ జరపాలన్న అభ్యర్థనపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సానుకూలత వ్యక్తం చేసింది. అనేక వివాదాలకు కేంద్ర బిందువైన సంజయ్‌లీలా బన్సాలీ చిత్రం పద్మావత్‌కు సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 25న పద్మావత్‌ను విడుదల చేయాలని నిర్మాత భావించారు. అయితే రాజస్థాన్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పద్మావత్ విడుదలపై నిషేధం విధించారు. శాంతిభద్రతల మిషతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని మార్పులు, చేర్పులతో సీబీఎఫ్‌సీ సర్ట్ఫికెట్ ఇచ్చినా నాలుగు రాష్ట్రాల్లో నిషేధం విధించడంపై నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. చివరికి పద్మావతి టైటిల్‌ను బోర్డు సూచనమేరకు పద్మావత్‌గా మార్చామని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయినా చిత్రం విడుదలపై నిషేధాన్ని కొనసాగించడం దారుణమని కోర్టుకు తెలిపారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా సారథ్యంలోని జస్టిస్ ఏఎం ఖన్వీకర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌తో కూడిన బెంచ్ గురువారం పిటిషన్‌ను విచారించే అవకాశం ఉంది.