జాతీయ వార్తలు

‘పన్ను’పోటు కాస్త తగ్గింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: 29 వస్తువులు, 53 సేవలకు సంబంధించి పన్నురేట్లను సవరిస్తూ ‘వస్తు సేవా పన్ను (జిఎస్టీ) మండలి’ గురువారం ఇక్కడ జరిపిన 24వ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 29 వస్తువులను, 53 సేవలను ‘తక్కువ పన్ను రేట్ల విభాగం’లోకి మార్చినట్లు ఆయన వివరించారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవచ్చన్న ఊహాగానాలు జీఎస్టీ మండలి భేటీ సందర్భంగా వినిపించాయి. కాగా, జిఎస్టీ ఫైలింగ్ విధానాన్ని సరళతరం చేసేందుకు సంబంధించి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. జిఎస్టీ ఫైలింగ్‌కు సంబంధించి నందన్ నీలేకని పూర్తిస్థాయి ప్రజంటేషన్ ఇచ్చారని, ఈ విషయమై చర్చ మాత్రం జరిగిందని తెలిపారు. పది రోజుల తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జీఎస్టీ సమావేశం మరోసారి జరుగుతుందని, ఆ సమావేశంలో రిటర్న్‌ల ఫైలింగ్‌పై చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని జైట్లీ తెలిపారు. జీఎస్టీ ఫైలింగ్ విధానంపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని, దీనికి ముందుగానే తాము ప్రతిపాదించే పత్రాల నమూనాలను అన్ని రాష్ట్రాలకు పంపుతామని తెలిపారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్, రియల్ ఎస్టేట్ రంగాలను తీసుకురావడంపై సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. జిఎస్టీ నుంచి మినహాయించాలన్న ఇతర వస్తువులకు సంబంధించి కూడా వచ్చే భేటీలో చర్చిస్తామన్నారు. క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, పెట్రోల్, డీజిల్, ఎటిఎఫ్, రియల్ ఎస్టేట్ రంగాలను జిఎస్టీ పరిధిలో చేర్చాలన్న ప్రతిపాదనలను జీఎస్టీ తదుపరి భేటీలో ఆమోదించే అవకాశం ఉందని తెలిపారు. 35వేల కోట్ల రూపాయల ఐజీఎస్టీ వసూళ్లను కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని జీఎస్టీ భేటీలో నిర్ణయించామన్నారు.