జాతీయ వార్తలు

‘ఎలక్టోరల్ బాండ్లు’ ఓ ముందడుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: రాజకీయ పార్టీలకు విరాళాలు, వాటి వినియోగంపై పారదర్శకతకు ఉద్దేశించిన ‘ఎలక్టొరల్ బాండ్లు’ సరైన మార్గంలో ‘ఓ ముందడుగు’ అన్న ఆశాభావాన్ని ఎన్నికల సంఘం వ్యక్తం చేసింది. గత ఏడాది ఎలొక్టరల్ బాండ్ల అంశం ప్రస్తావనకు వచ్చినపుడు దాన్ని ఓ ‘తిరోగమన చర్య’గా అభివర్ణించిన ఎన్నికల సంఘం ఇపుడు అందుకు భిన్నంగా మాట్లాడడం గమనార్హం. అయితే, రాజకీయ పార్టీలకు విరాళాలకు సంబంధించి అన్ని సమస్యలకూ ‘ఎలక్టొరల్ బాండ్లు’ మాత్రమే ఏకైక పరిష్కారం అని భావించడానికి కూడా వీలులేదని ఎన్నికల ప్రధాన కమిషనర్ ఏకే జోతి పేర్కొనడం గమనార్హం. ‘మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలు ఎలక్టొరల్ బాండ్లను వినియోగించే అవకాశం ఉందా?’ అని విలేఖరులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలక్టొరల్ బాండ్లు అందుబాటులో ఉన్నాయంటూ ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలోనే ప్రకటించినందున మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వాటిని వినియోగించే అవకాశం కచ్చితంగా ఉంటుందని జోతి తెలిపారు. ఈ మూడు రాష్ట్రాలకు ఎన్నికల తేదీలను ప్రకటించే సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలక్టొరల్ బాండ్ల విషయంలో ఎన్నికల సంఘం వైఖరిలో ఇపుడు ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ‘మా ప్రయత్నం మంచి మార్గంలో ముందడుగు అనే భావిస్తున్నాం.. అయితే అన్నింటికీ అవే పరిష్కారం కాదు.. ముందుగా మంచి సమాచారం రానివ్వండి..’ అని ఆయన అన్నారు. ప్రభుత్వం విడుదల చేయాలనుకుంటున్న ‘ఎలక్టొరల్ బాండ్లు’ ఓ తిరోగమన చర్య అని గత మేనెలలో పార్లమెంటరీ కమిటీకి ఎన్నికల కమిషన్ తెలిపింది. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలపై పారదర్శకత ఉండాలంటే ఎన్నికల చట్టాల్లో సవరణలు చేయాలని కూడా కమిషన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రామిసరీ నోటు లేదా బ్యాంకు నోట్ మాదిరి బాండ్‌ను కలిగి ఉన్నవారికి వడ్డీ లేకుండా అందులోని మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ బాండ్లను ఏ పౌరుడైనా, సంస్థ అయినా కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు విరాళాల రూపంలో ఇవ్వొచ్చు. వెయ్యి, పదివేలు, లక్ష, పది లక్షలు, కోటి రూపాయల డినామినేషన్లలో నిర్దేశించిన కొన్ని స్టేట్ బ్యాంకు శాఖల్లో వీటిని పొందవచ్చు.