జాతీయ వార్తలు

ఉగ్రవాదులకు నిధులిచ్చిన 12 మందిపై ఎన్‌ఐఏ చార్జిషీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: కాశ్మీర్‌లోయలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందజేశారన్న అభియోగంపై లష్కర్-ఈ-తైబా నేత హఫీజ్ సరుూద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ అధిపతి సయ్యద్ సలాహుద్దీన్‌తో పాటు మరో 10 మందిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చార్జిషీటు దాఖలు చేసింది. 1,279 పేజీలతో కూడిన చార్జిషీటును కోర్టులో సమర్పించి, తాము దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్‌ఐఏ కోరింది. ఈ కేసులో అరెస్టు చేసిన పదిమంది నిందితులకు జుడీషియల్ కస్టడీ గురువారం ముగిసిన నేపథ్యంలో చార్జిషీటును దాఖలు చేశారు. న్యాయవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద ఆరునెలల్లోగా చార్జిషీటు దాఖలు చేయని పక్షంలో నిందితులు బెయిల్ పొందే అవకాశం ఉంది. తమ దర్యాప్తులో నిందితులపై అభియోగాలకు సంబంధించి కచ్చితమైన సాక్ష్యాలు, సాంకేతికపరమైన ఆధారాలు లభించాయని, 60 ప్రాంతాల్లో తాము దాడులు చేసి 950 పత్రాలను స్వాధీనం చేసుకున్నామని ఎన్‌ఐఏ తెలిపింది. ఈ కేసులో 300 మంది సాక్షులను గుర్తించామని చార్జిషీటులో పేర్కొంది.
జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిన వారిలో అల్త్ఫా అహ్మద్ షా ఎలియాస్ అల్త్ఫా ఫంతూష్ (సయ్యద్ అలీ షా గిలానీ అల్లుడు), మిర్వయిజ్ ఉమర్ ఫరూఖ్ అధికార ప్రతినిధి షాహిద్ అల్ ఇస్లాం, వేర్పాటువాదులు నరుూం ఖాన్, బషీర్ భట్ ఎలియాస్ పీర్ సైఫుల్లా, రాజా మెహ్రజుద్దీన్ కల్వాల్, పేరొందిన వ్యాపారవేత్త జహూర్ అహ్మద్ వతాలీ తదితరులు ఉన్నారు. వీరంతా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందజేస్తున్నారని అభియోగం. 2016లో పోలీసు కాల్పుల్లో బుర్హాన్ వనీ మరణించాక కాశ్మీర్‌లోయలో భారీ ఎత్తున జరిగిన విధ్వంసానికి సంబంధించి కూడా నిందితులపై కేసులు నమోదు చేశారు. జెకెఎల్‌ఎఫ్ మాజీ మిలిటెంట్ బిట్టా కరటే, ఫొటో జర్నలిస్టు కమ్రాన్ యూసఫ్, జావెద్ అహ్మద్ భట్‌లపైనా చార్జిషీటు దాఖలైంది.
కాశ్మీర్‌లోయలో ఉగ్రవాదులను ఉసిగొల్పేందుకు లష్కరే నేత సరుూద్, హిజ్బుల్ అధినేత సలాహుద్దీన్ నిధులను సమకూర్చారని ఎన్‌ఐఏ చార్జిషీటులో పేర్కొంది. సరుూద్‌తో పాటు గిలానీ, మిర్వయిజ్ ఫరూఖ్‌ల ఆధ్వర్యంలోని హురియత్ కాన్ఫరెన్స్ వర్గాలపైన, హిజ్బుల్ ముజాహిద్దీన్, దుఖ్తారన్-ఈ-మిలాత్ సంస్థలపైన అభియోగాలతో చార్జిషీటు దాఖలు చేశారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు నిధుల పంపిణీకి సంబంధించి పాకిస్తాన్‌కు చెందిన నలుగురి నుంచి వాంగ్మూలాన్ని ఎన్‌ఐఏ అధికారులు నమోదు చేశారు. కాశ్మీర్‌లో సైనికులపై రాళ్లు రువ్వి అశాంతిని రెచ్చగొట్టిన వేర్పాటువాదులపైనా కేసులు నమోదు చేశారు.