జాతీయ వార్తలు

మోగిన ‘ఈశాన్య’ నగారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఈశాన్య భారత దేశంలోని మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర శాసనసభల ఎన్నికల షెడ్యూలును ప్రకటించింది. త్రిపుర శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి 18 జరిగితే, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికలు ఫిబ్రవరి 27న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి మూడోతేదీన జరుగుతుంది. మేఘాలయ శాసనసభ పదవీకాలం మార్చి 6న, నాగాలాండ్ అసెంబ్లీ మార్చి 13న, త్రిపుర శాసనసభ పదవీకాలం మార్చి 14న ముగుస్తాయి. మేఘాలయ, ఈ రాష్ట్రాల శాసనసభల్లో 60 చొప్పున సీట్లున్నాయి. మేఘాలయలో 55 సీట్లు, నాగాలాండ్‌లో 59 సీట్లు షెడ్యూల్డు తెగలవారికి రిజర్వు చేయబడ్డాయి. త్రిపురలోని మొత్తం 60 సీట్లలో సీట్లు ఎస్‌స్సీలు, 20 ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి. మేఘాలయలో 18,30,104, నాగాలాండ్‌లో 11,89,264, త్రిపురలో 25,69,216 మంది ఓటర్లున్నారు. మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో నూటికి నూరు శాతం ఓటర్లకు ఎన్నికల సంఘం ఫోటో గుర్తింపు కార్డులున్నాయి. నాగాలాండ్‌లోని 97 శాతం మంది ఓటర్లకు ఫోటో గుర్తింపు కార్డులున్నాయి.
త్రిపుర శాసనసభ ఎన్నికకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ జనవరి 24న విడుదల చేస్తారు. జనవరి 31లోగా నామినేషన్లను దాఖలు చేయవలసి ఉంటుంది. ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 3లోగా నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. పోలింగ్ ఫిబ్రవరి 18, ఓట్ల లెక్కింపు మార్చి 3న జరుగుతుంది. మేఘాలయ, నాగాలాండ్ శాసనసభల ఎన్నికకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ జనవరి 31న జారీ అవుతుంది. ఫిబ్రవరి 7లోగా నామినేషన్ పత్రాల దాఖలు, ఫిబ్రవరి 8 నుంచి నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు గడువు ఫిబ్రవరి 13. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన పోలింగ్ ఫిబ్రవరి 27న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మార్చి మూడో తేదీన చేపడతారు. ఈ మూడు ఈశాన్య రాష్టల్ర శాసనసభల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను మార్చి 5లోగా ముగించవలసి ఉంటుంది. మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్‌కు చెందిన ముకుల్ సంగ్మా ఏడేళ్ల నుండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. త్రిపురలో సీపీఐ (మార్క్సిస్ట్) అధికారంలో ఉంది. ఇక్కడ మణిక్ సర్కార్ 1998 నుండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారు. నాగాలాండ్‌లో నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ అధికారంలో ఉంది. ఈ పార్టీకి చెందిన షుర్హొజెల్లి లీజిస్టు 2017 మే నుండి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

చిత్రం..మూడు ఈశాన్య రాష్ట్రాల్లో నిర్వహించనున్న ఎన్నికల షెడ్యూల్‌ను వివరిస్తున్న ఎన్నికల ప్రధాన కమిషనర్ ఏకే జోతి. చిత్రంలో కమిషనర్లు సునిల్ అరోరా, ఓపీ రావత్