జాతీయ వార్తలు

మోదీ రుణం తీర్చుకున్న సీఈసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 19: తమ పార్టీకి చెంది న 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సిఫార్సు చేసి ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఏకే జోతి ప్రధాని మోదీ రుణం తీర్చుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తీవ్రస్థాయిలో విమర్శించింది. పదవి నుంచి దిగిపోయే ముందు సీఈసీ ఇలా మోదీకి దాసోహం కావడం అనైతికమని ఆప్ ఢిల్లీ విభాగం ప్రధాన అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మోదీ.. సీఈసీ పదవిని కట్టబెట్టినందుకు జోతి రాజకీయ ఒత్తిడికి లొంగి ఈ విధంగా రుణం

తీర్చుకోవడం అప్రజాస్వామికమన్నారు. కాగా, ఎమ్మెల్యేలపై అనర్హతకు సంబంధించి తమకు అధికారికంగా సమాచారం అందాల్సి ఉందని భరద్వాజ్ తెలిపారు. ఎన్నికల సంఘం గతంలో ఎన్నడూ ఇలా వ్యవహరించలేదని ఆప్ సీనియర్ నేత అశుతోష్ వ్యాఖ్యానించారు. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలు లాభదాయకపదవుల్లో ఉన్నారన్న సాకుతో అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం సిఫార్సు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈనెల 23న సీఈసీ పదవి నుంచి వైదొలగనున్న జోతి ఈ చర్యకు దిగడం తగదన్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో జోతి ముఖ్య కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారని భరద్వాజ్ గుర్తుచేశారు. గుజరాత్‌లో 1975 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి జోతి సీఈసీ పదవిని చేపట్టి మోదీ చెప్పినట్లు వ్యవహరించారని ఆరోపించారు.
హైకోర్టులో నిరాశే..
లాభదాయక పదవుల్లో ఉన్నందున 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఎన్నికల సంఘం సిఫార్సు చేయడాన్ని సవాలు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆ 20 మంది ఎమ్మెల్యేలలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఎన్నికల సంఘం సిఫార్సు చెల్లదని ప్రకటించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే, ఈ పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్ నిరాకరించారు. ఈసీ సిఫార్సులను అడ్డుకునేలా హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో ఆప్ ఎమ్మెల్యేలు నిరాశకు గురయ్యారు.
పాలించే అర్హత కేజ్రీకి లేదు: కాంగ్రెస్
20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం రాష్టప్రతికి సిఫార్సు చేసినందున ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హతను ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కోల్పోయారని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ విభాగం అధినేత అజయ్ మాకెన్ అన్నారు. ‘పదవిలో కొనసాగే అర్హతను కేజ్రీ కోల్పోయారు. ఆయన క్యాబినెట్‌లో సగం మంది ఇప్పటికే అవినీతి ఆరోపణలపై ఉద్వాసనకు గురయ్యారు. ఇపుడు 20 మందిపై అనర్హత వేటు పడబోతోంది..’ అని మాకెన్ ట్వీట్ చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని భోంచేస్తుంటే కేజ్రీవాల్ చెబుతున్న లోక్‌పాల్ వ్యవస్థ ఎక్కడుందని మాకెన్ ప్రశ్నించారు.