జాతీయ వార్తలు

మళ్లీ తెగబడిన పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, జనవరి 19: జమ్మూ కాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్తాన్ సైనికులు శుక్రవారం ఉదయం జరిపిన కాల్పుల్లో ఓ బీఎస్‌ఎఫ్ జవానుతో పాటు ఇద్దరు పౌరులు మరణించారు. ఇదే ఘటనలో ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లతో పాటు 23 మంది స్థానికులు గాయపడ్డారు. జమ్ము, సాంబ, కతువా జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతంలో రెండోరోజు శుక్రవారం కూడా పాక్ రేంజర్ల కాల్పులు కొనసాగాయి. అంతర్జాతీయ సరిహద్దులో ఉదయం నుంచి భారీగా కాల్పులు జరుగుతున్నాయని భారత సైనిక అధికారులు వెల్లడించారు. ఆర్‌ఎస్ పుర, అర్నినా, రామ్‌గఢ్ ప్రాంతాల్లో ఉదయం ఆరున్నర గంటలకే కాల్పులు వినిపించాయి. సాయంత్రానికి కతువా జిల్లాలో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. మూడు సెక్టార్ల పరిధిలోని 45 బోర్డర్ ఔట్ పోస్టులపై పాక్ రేంజర్లు గురిపెట్టి కాల్పులు కొనసాగించారు. కాల్పుల్లో గాయపడ్డ బీఎస్‌ఎఫ్ జవాన్ జగ్‌పాల్ సింగ్ మరణించారు. కాల్పుల్లో మరణించిన పౌరులను సాహిల్ (25), బచ్నో దేవి (50)గా పోలీసులు గుర్తించారు. వాస్తవాధీన రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ భద్రతా దళాలు పదే పదే కాల్పులు జరుపుతున్నాయని భారత సైనికాధికారులు తెలిపారు.
గ్రెనేడ్ దాడిలో
8మంది పోలీసులకు గాయాలు
జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో తహశీల్ కార్యాలయంపై శుక్రవారం నాడు మిలిటెంట్లు గ్రెనేడ్ దాడి చేయగా 8 మంది పోలీసులు గాయపడ్డారు. రద్దీ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు ఈ చర్యకు పాల్పడ్డారు. గాయపడిన పోలీసులను పుల్వామా ఆస్పత్రిలో చేర్పించారు. గాయపడిన ఎఎస్‌ఐ మహమ్మద్ షఫీ, హెడ్ కానిస్టేబుల్ గులాం నబీని బాదామీబాగ్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు.

చిత్రాలు..పాక్ సైనికుల కాల్పుల్లో దెబ్బతిన్న ఆర్.ఎస్.పురా సెక్టార్‌లోని సుచేట్‌గఢ్‌లోని ఓ నివాసం
*పాక్ సైనికుల కాల్పుల్లో హీరానగర్‌లో గాయపడిన ఓ మహిళను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం