జాతీయ వార్తలు

సాగరమే చిన్నబోయింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 19: భారత నౌకాదళ చరిత్రలో ఓ అపురూపమైన ఘట్టం చోటుచేసుకుంది. సముద్ర మార్గం ద్వారా ప్రయాణాన్ని ప్రారంభించిన ఇండియన్ నేవీ మహిళలు అత్యంత కఠినమైన కేప్‌హార్న్‌ను దాటేశారు. శుక్రవారం ఈ అరుదైన, అతి కష్టమైన విజయం భారత్‌కు సంపాదించి పెట్టారు. తమ విజయానికి గుర్తుగా కేప్‌హార్న్‌పై మన జాతీయ పతాకాన్ని ఎగరేశారు. సముద్ర జలాల్లోకెల్లా అత్యం కఠినమైన ప్రాంతం కేప్‌హార్న్‌గా చెబుతారు. ఐఎన్‌ఎస్‌వీ తరుణి బృందం సాధించిన ఈ విజయంపై యావత్ భారత దేశం గర్విస్తోంది. భారత నేవీలోని మాండోవిగా విభాగానికి చెందిన ఆరుగురు మహిళా అధికారిణిలు గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ యాత్రను ప్రారంభించారు. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్‌ఎస్ తరుణిలో గోవా నుంచి యాత్రను ప్రారంభించారు. అమెరికాలోని కేప్‌హార్న్‌ను దాటిన బృందం పోర్ట్‌స్టాన్లీలో కొంత విరామం తీసుకున్నాక మళ్లీ యాత్ర ప్రారంభిస్తుంది. కాగా తరిణి బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఐఎన్‌ఏస్ తరుణి కేప్‌హార్న్‌ను దాటగానే మోదీ సంతోషంగా ట్వీట్ చేశారు.‘ భారత్‌కు అనిర్వచనీయమైన కీర్తిని సాధించిపెట్టారు. జాతి మొత్తం గర్వించేలా చేశారు’ అని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘రోజు ఓ మంచి వార్త విన్నా’నని ఆయన అన్నారు. ఇలా ఉండగా లెఫ్టినెంట్ కమాండర్ వర్తిక జోషీ నాయకత్వంలో తరుణి బృందం సాగుతోంది. ఆమెతోపాటు లెఫ్టినెంట్ కమాండర్లు ప్రతిభా జామ్‌వాల్,పీ స్వాతి, లెఫ్టినెంట్‌లు పాయల్ గుప్తా, విజయ్ దేవీ, అశ్వర్యా బోడ్డపాటి బృందంలో ఉన్నారు. తరుణి టీమ్ ఇంతకుముందు నావికా సాగర్ యాత్రలో పాల్గొన్నారు. తొలిసారి మొత్తం మహిళలతోనే ఐఎన్‌ఎస్‌వీ తరుణి సాగుతోంది.

చిత్రం..కేప్‌హార్న్ సముద్ర జలాలపై భారత జాతీయ పతకాన్ని ఎగురవేసిన మహిళా నావికులు